Share News

దర్జాగా కబ్జా

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:57 AM

గ్రామంలోని సర్వే.నెం.337లో బసవన్న ఆలయం వెనుక భాగంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు 16 సెంట్ల కల్లందొడ్డిని కొనుగోలు చేశారు. అయితే ప్కనే ఉన్న రూ.20లక్షలు విలువ చేసే పంచాయతీ స్థలాన్ని కలిపేసుకున్నారు.

దర్జాగా కబ్జా
మద్దికెరలో ఆక్రమణకు గురైన పంచాయతీ స్థలం ఇదే

రియల్టర్ల దుర్మారం

నోటీసు బోర్డు పీకేసిన వైనం

మద్దికెర, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): గ్రామంలోని సర్వే.నెం.337లో బసవన్న ఆలయం వెనుక భాగంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు 16 సెంట్ల కల్లందొడ్డిని కొనుగోలు చేశారు. అయితే ప్కనే ఉన్న రూ.20లక్షలు విలువ చేసే పంచాయతీ స్థలాన్ని కలిపేసుకున్నారు.

పట్టించుకోని పంచాయతీ అధికారులు

స్థలం కబ్జా అవుతున్నా, పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లాట్లు వేయాలంటే పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాలి. కానీ మద్దికెర గ్రామంలో పలువురు అనుమతులి లేకుండానే ప్లాట్లు వేసి, విక్రయిస్తున్నారు. భూమిని చదును చేసేందుకు హంద్రీనీవా మట్టిని ఉపయోగిస్తున్నా, హంద్రీనీవా అధికారులు పట్టించు కోవడం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నోటీసు బోర్డును తొలగించారు

గతంలో ఇక్కడ ఉన్న సామూహిక మరుగుదొడ్లను సపంచాయతీ అధికారుల కూల్చి వేశారు. అనంతరం రాళ్లు పాతి, చుట్టూ కంచెవేసి, ఈ ‘స్థలం పంచాయ తీదే’ అని నోటీసు పెట్టారు. అయితే కబ్జాదా రులను ఆ బోర్డును పీకేశారు.

నోటీసులు జారీ చేస్తాం

బసవన్న గుడి వెనుక పంచాయతీ స్థలం ఆక్రమించుకున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆకరమణదారులకు నోటీసులు జారీ చేస్తాం. పంచాయతీ స్థలం అన్యాక్రాంతం కాకుండా హద్దులు ఏర్పాటు చేస్తాం. - శివకుమార్‌, పంచాయతీ కార్యదర్శి

Updated Date - Jan 05 , 2025 | 12:57 AM