Share News

పడిపోయిన కందుల ధర

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:22 PM

మండలంలోని మద్దికెర, పెరవలి, ఎం.అగ్రహారం, బసినేపల్లి గ్రామాల్లో సుమారు 8వేల ఎకరాల్లో కంది సాగు చేశారు. అయితే మొన్నటి వరకు క్వింటం రూ.9వల నుంచి రూ.10వేలకు పలికిన కందుల ధర దిగుబడి చేతికి వచ్చే సమయానికి రూ.6వేలకు పడిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు.

పడిపోయిన కందుల ధర
మద్దికెర మండలంలో ఆరబెట్టిన కందులు

మొన్నటి వరకు క్వింటం రూ.10 వేలు, నేడు రూ.6వేలు

ప్రభుత్వం కొనేదెప్పుడు? ఆవేదన చెందుతున్న రైతులు

మద్దికెర, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మద్దికెర, పెరవలి, ఎం.అగ్రహారం, బసినేపల్లి గ్రామాల్లో సుమారు 8వేల ఎకరాల్లో కంది సాగు చేశారు. అయితే మొన్నటి వరకు క్వింటం రూ.9వల నుంచి రూ.10వేలకు పలికిన కందుల ధర దిగుబడి చేతికి వచ్చే సమయానికి రూ.6వేలకు పడిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు.

ప్రభుత్వం కొనేదెప్పుడు?

కందులను ప్రభుత్వం క్వింటం రూ.7,500ల ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పినా ఆ దిశగా ఏర్పాటు చేయలేదు. దిక్కతోచని రైతులు వ్యాపారులకు అమ్ముకో వలసి వస్తుందని ఆందోళన చెందు తున్నారు. మరికొందరు కందులను కల్లాల్లోనే నిల్వ చేస్తున్నారు.

ఎకరాకు 30వేల పెట్టుబడి

మండలంలోని కాలువలు, వ్యవసా య బావుల కింద కంది సాగుచేశారు. ఎకరాకు రూ.30వేల దాకా ఖర్చు అయింది. ఈ ఏడాది కరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తీరా పంటను నూర్పిడి చేసే సమయంలో బహిరంగ మార్కెట్‌లో ధర సగానికి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు దాదాపు 30వేల దాకా పెట్టుబడి పెట్టామని, క్వింటం రూ.6వేలకు అమ్మితే పెట్టు బడి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు. వ్యాపారులు క్వింటానికి 6 కేజీల వరకు తరుగు తీసుకుంటుండటంతో ఇక నష్టం తప్పదని రైతులు అంటున్నారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

రెండెకరాల్లో కంది సాగు చేశా. మొన్నటి దాకా రూ.10 వేలు పలికిన ధరను వ్యాపారులు రూ.6వేల నుంచి రూ.7వేలకు తగ్గించారు. ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి. - మల్లయ్య, రైతు, మద్దికెర

ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

కందులను జనవరిలో మార్క్‌ ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం క్వింటం రూ.7,500 ప్రకారం కొనుగోలు చేస్తుంది. ఈ క్రాప్‌ చేసిన రైతులం తా రైతు భరో కేంద్రాల్లో రిజిస్ర్టేష న్లు చేయించుకోవాలి. - ఏవో, రవి

Updated Date - Jan 01 , 2025 | 11:22 PM