ప్రజా శ్రేయస్సే లక్ష్యం
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:17 AM
కొత్త సంవత్సరంలో ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
జిల్లా ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు
బనగానపల్లె, డిసెంబరు 31, (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరంలో ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు, యువత, అన్ని వర్గాల ప్రజలు నూతన సంవత్సరంలో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీసీ కుటుంబ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో వర్షాలు బాగా పడి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో, పాడి పంటలతో గ్రామాలు కళకళలాడాలని కోరారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు అంతా మంచి జరగాలని కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా నూతన సంవత్సరం వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో నూతన సంవత్సరం సందర్భంగా బనగానపల్లెలో అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ క్యాంపు కార్యాలయానికి రాకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని మంత్రి బీసీ పిలుపునిచ్చారు.