Share News

రంగుల హరివిల్లు

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:46 PM

సంక్రాంతి ముందే వచ్చినట్లుగా రంగుల హరివిల్లు నేలను తాకినట్లు కనిపించింది. ఆదోని పట్టణంలోని మిల్టన్‌ పాఠశాల మైదానంలో ఆదివారం ఉదయం ఆదోని పీసీ ఇన్‌చార్జి బత్తిన మల్లికార్జున ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు.

రంగుల హరివిల్లు
ఇదిగో రంగుల ప్రపంచం.. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మత్యాలముగ్గుల పోటీలు ఏరియల్‌ వ్యూ, ఇన్‌సెట్‌లో విజేతలు

ఆదోనిలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు

ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువతులు

ఆదోని/ టౌన్‌/ అగ్రికల్చర్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి ముందే వచ్చినట్లుగా రంగుల హరివిల్లు నేలను తాకినట్లు కనిపించింది. ఆదోని పట్టణంలోని మిల్టన్‌ పాఠశాల మైదానంలో ఆదివారం ఉదయం ఆదోని పీసీ ఇన్‌చార్జి బత్తిన మల్లికార్జున ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల స్పాన్సర్లుగా బత్తిన లక్ష్మీనారాయణ, హనుమంతమ్మ దంపతులు, బత్తిన కుబేర్‌నాథ్‌ వ్యవహరించారు. కో స్పాన్సర్లుగా గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్స్‌ పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌) వారు వ్యవహరించారు.

సాంప్రదాయాలను కాపాడుతున్న ఆంధ్రజ్యోతి

పోటీల్లో 66 మంది మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సోమన్న మాట్లాడు తూ మన సంస్కృతి సాంప్రదాయాలను ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కాపాడుతోందన్నారు. పండుగ విశిష్టత, సంస్కృ తిపై మహిళలకు ఉన్న గౌరవాన్ని ప్రోత్సహించేలా పోటీలు ఉన్నాయన్నారు. ఇటువంటి పోటీలకు తనవంతు సహకారం అంది స్తానని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా న్యాయవాది లలితా జితేంద్ర, జయప్రద, పరిమళ వ్యవహరిం చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్‌, చిన్న, రవికుమార్‌, స్వరూప్‌ కుమార్‌, వెంకటరమణ, శివకేశవ్‌, మగ్దూం పాల్గొన్నారు.

విజేతలు వీరే

పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన గౌతమికి రూ.6వేల నగదు బహుమతిని అందజేశారు. రెండో స్థానంలో నిలిచిన ఎ. రేణుక రూ.4వేల నగదును అందుకున్నారు. తృతీయ బహుమతి గెలుచుకున్న బి.శిరీషా పాటీల్‌కు రూ.3వేల నగదును అందచేశారు. ముగ్గురి పారిశ్రామికవేత్త బత్తిన లక్ష్మినారాయణ, హనుమంతమ్మ, బత్తిన కుబేర్‌నాథ్‌, మల్లీశ్వరి, నెలగొండ తిమ్మప్ప, బత్తిన లోకనాథ్‌, మంజుల, ఆంధ్రజ్యోతి పీసీ ఇన్‌చార్జి మల్లికార్జున బహుమతులను అందజేశారు. కన్సోలేషన్‌ బహుమతులకు కల్యాణి, అనిత, పల్లవి, శ్వేత, శృతి, శాంతి ఎంపికయ్యారు. వీరికి డీఎస్పీ సోమన్న, మిల్టన్‌ గ్రామర్‌ స్కూల్‌ అదినేత రమేష్‌ బాబు, సీఈవో వెంకటేష్‌, బత్తిన లక్ష్మీనారాయణ, బత్తిన కుబేర్‌ నాథ్‌ ఆందజేశారు.

సంక్రాంతి ముందే కనిపిస్తోంది

మైదానంలో వేసిన ముగ్గులను చూస్తుంటే సంక్రాంతి పండగ ముందే కనిపిస్తోంది. ముగ్గుల పోటీలతో యువతులు, మహిళళ్లో ఉత్సాహం కనిపిస్తోంది. గతేడాది కూడా స్పాన్సరులుగా వ్యవహరించినందుకు ఆనందంగా ఉంది. మహిళలు సందేశం ఇచ్చేలా ముగ్గులు వేశారు. కాలం మారుతున్నా సాంప్రదాయాలను పోకూడదని మా ఉద్దేశ్యం. - బత్తిన లక్ష్మీనారాయణ, పారిశ్రామిక వేత్త

Updated Date - Jan 05 , 2025 | 11:46 PM