Share News

సృజనకు ప్రతిబింబాలు రంగవల్లులు

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:43 AM

రానున్న సంక్రాంతి పర్వదిన సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన’ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు, గార్డెనింగ్‌ పార్ట్‌నర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌...ఫ్యాషన పార్ట్‌నర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహి ళల ఇన్నర్‌వేర్‌) ఆధ్వర్యంలో, స్థానిక స్పాన్సర్లుగా టీజీవీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ, ఆయన తనయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరతల సహ కారంతో, మాంటిస్సోరి విద్యాసంస్థల డైరెక్టర్‌ కేఎనవీ రాజశేఖర్‌ల సౌజన్యంతో నగరంలోని ఏ.క్యాంపు మాంటిస్సోరి హైస్కూల్‌ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు స్పందన లభిం చింది.

సృజనకు ప్రతిబింబాలు రంగవల్లులు
ముగ్గులను పరిశీలిస్తున్న సమాచార శాఖ డీడీ జయమ్మ

కర్నూలు కల్చరల్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రానున్న సంక్రాంతి పర్వదిన సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన’ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు, గార్డెనింగ్‌ పార్ట్‌నర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌...ఫ్యాషన పార్ట్‌నర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహి ళల ఇన్నర్‌వేర్‌) ఆధ్వర్యంలో, స్థానిక స్పాన్సర్లుగా టీజీవీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ, ఆయన తనయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరతల సహ కారంతో, మాంటిస్సోరి విద్యాసంస్థల డైరెక్టర్‌ కేఎనవీ రాజశేఖర్‌ల సౌజన్యంతో నగరంలోని ఏ.క్యాంపు మాంటిస్సోరి హైస్కూల్‌ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు స్పందన లభిం చింది. 307 మంది మహిళలు పోటా పోటీగా వేసిన ముగ్గులన్నీ మురింపింపజేశాయి. ఉదయం 8 గంటల నుంచే మహిళలు పోటీ కేంద్రానికి చేరుకోవడం, తమ పేర్లు నమోదు పట్టికలో సరిచూ సుకోవడంలో మునిగిపోయాయి. ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోటీలు 12.30 గంటల వరకు కొనసాగాయి. రెండు గంటల వ్యవధిలో మహిళలు ముగ్గులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అధ్యాపకులు డాక్టర్‌ దండెబోయిన పార్వతీదేవి, టీవీ పద్మలత, చిత్రకళా ఉపాధ్యాయుడు సర్దార్‌ రాముడు వ్యవహరించారు.

గతంలోనూ బహుమతులు అందుకున్నా..

గతంలోనూ అనేక ముగ్గుల పోటీల్లో నాకు బహుమతులు లభిం చాయి. ఆంధ్రజ్యోతి-ఏబీఎన గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న పోటీ ల్లోనూ నాకు బహుమతులు లభించాయి. రాష్ట్రస్థాయి పోటీలకు కూ డా వెళ్లి వచ్చాను. రాష్ట్ర స్థాయిలోనూ ఒకసారి ప్రథమ బహుమతి అందుకున్నాను. ఈ ముగ్గుల పోటీలకు బహుమతులు ఆశించి కాకుండా నాలోని ప్రతిభను, సృజనకు పదును పెట్టాలనే ఆలోచ నతో ఏటా పోటీల్లో పాల్గొంటున్నాను. ఈ ఏడాది జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి రావడం సంతోషంగా ఉంది.

- ఆర్‌. గౌతమి, (ప్రథమ బహుమతి విజేత) కర్నూలు

అమ్మ ప్రోత్సాహంతో ముగ్గులు నేర్చుకుంటున్నా..

మా అమ్మ ప్రోత్సాహంతో నేను ముగ్గులు నేర్చుకుంటున్నారు. సంక్రాంతి పండుగలో ముగ్గులకు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. ఆంధ్రజ్యోతి వారు ముగ్గుల పోటీలతో మహిళలను ప్రత్యేకించి గృహిణులకు ఈ పోటీల ద్వారా ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. నాకు ద్వితీయ బహుమతి వచ్చినందుకు ఆనందంగా ఉంది.

- శరణ్య, బీటెక్‌ విద్యార్థిని, (ద్వితీయ బహుమతి విజేత), కర్నూలు

భావితరాలకు చాటి చెప్పేలా పోటీలు

నేను గత ఆరేడు ఏళ్లుగా పోటీలకు వస్తున్నాను. ఇతరులు వేసే ముగ్గుల్లోని కొత్తదనాన్ని తెలుసుకుంటున్నాను. బహుమతులు, గెలుపు ఓటముల కన్నా, మంచి ముగ్గులను చూసే, నేర్చుకునే అవకాశం ఈ పోటీల వల్ల కలుగుతుంది. ఈ సంప్రదా యాన్ని భావితరాలకు చాటి చెప్పేలా పోటీలు ఉండటం అభినందనీయం.

- ఎం రేణుక, (తృతీయ బహుమతి విజేత), కర్నూలు

Updated Date - Jan 06 , 2025 | 01:43 AM