రూ.20 కోట్ల భూమిని కాజేశారు..!
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:32 AM
పట్టణంలో రూ.20 కోట్ల భూమిని కాజేశారు. మండగిరిలో నివాసముం టున్న ఎగ్గటి ఈశ్వరప్పకు బైపాస్ సమీపంలోని సర్వే నెంబర్ 321-ఏలో 6.51 ఎకరాల ు భూమి వారసత్వంగా వచ్చింది. నేషనల్ హైవే పొలంలోనే వెళ్లడంతో భూమి ధరలు పెరిగి పోయాయి. మార్కెట్‌లో ఎకరా రూ.3 నుంచి రూ.4కోట్లు పలుకుతుండటంతో దానిపై కూటమి ్టకి చెందిన ఓ నాయకుడి కన్నుపడింది. దీంతో భూ యజమాని ఎగ్గటి ఈశ్వరప్ప 2009లో మృతి చెందినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ పుట్టించారు.
బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా
మరణ ధ్రువీకరణ పత్రం సృష్టి
ఆపై అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి వేరొకరికి రిజిస్ట్రేషన్
ఆదోని, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో రూ.20 కోట్ల భూమిని కాజేశారు. మండగిరిలో నివాసముం టున్న ఎగ్గటి ఈశ్వరప్పకు బైపాస్ సమీపంలోని సర్వే నెంబర్ 321-ఏలో 6.51 ఎకరాల ు భూమి వారసత్వంగా వచ్చింది. నేషనల్ హైవే పొలంలోనే వెళ్లడంతో భూమి ధరలు పెరిగి పోయాయి. మార్కెట్‌లో ఎకరా రూ.3 నుంచి రూ.4కోట్లు పలుకుతుండటంతో దానిపై కూటమి ్టకి చెందిన ఓ నాయకుడి కన్నుపడింది. దీంతో భూ యజమాని ఎగ్గటి ఈశ్వరప్ప 2009లో మృతి చెందినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ పుట్టించారు.
నంద్యాల పట్టణం లోని ఉప్పరిపేటలో నివాసం ఉంటున్న లేట్ ఎగ్గటి ఈశ్వరప్ప, కేరఫ్ ఆముదాల సుబ్బరాయుడు కుమా రుడు ఆముదాల భాస్కర్ ఆ పొలంపై సర్యాధికారాలు తనవి అన్నట్లుగా డాక్యుమెంట్లు తయారు చేసుకొని గోనెగండ్ల మండలం పెద్ద మర్రివీడు గ్రామానికి చెందిన చాకలి కర్రెన్న గారి కుమారుడు ఈరన్నకు 2024 డిసెంబరు 31వ తేదీన ఆగమేఘాల మీద ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించి, అనంతరం ప్లాట్లు వేశారు. సమాచారం తెలుసుకున్న రైతు ఎగ్గటి ఈశ్వరప్ప సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విచారించి, రిజిస్ట్రార్‌కు తన భూమి డాక్యుమెంట్లు చూపించారు. బతికున్న వ్యక్తి చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ ఎలా పుట్టించారని ఈశ్వరప్ప కుమారులు మోహన్ కుమార్, సునీల్ కుమార్ నిలదీశారు. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం కనిపించింది. సబ్ రిజిస్ర్టార్, జూనియర్ అసిస్టెంట్ రమేష్ డాక్యుమెంటు సిద్ధం చేయాలని తనకు చెప్పడంతోనే చేశానని, తనకు తనకు సంబంధం లేదని డాక్యుమెంట్ రైటర్ మహబూబ్ వివరించారు. బతికున్న వ్యక్తి 2009లో మృతి చెందినట్లు నకలీ డెట్ సర్టిఫికెట్ పుట్టించి రిజిస్టర్ ఎలా చేశారని, అందులో ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ కూడా కరెక్ట్‌గా లేదని సబ్ రిజిస్ట్రార్ హాజీమియాను బాధతులు నిలదీశారు. అనంతరం సబ్ రిజిస్ర్టార్ రికార్డులను పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బాధితుడు ఈశ్వరప్ప కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ హాజీ మియాను వివరణ కోరగా.. డాక్యుమెంట్లు అధికంగా వస్తున్నాయని, దీనిని సరిగా చూడలేదని, రిజిస్ర్టేషన్‌ను రద్దు చేస్తామన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, నిందితులపై కేసు నమోదు చేసి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
సబ్ రిజిస్ర్టార్‌తోపాటు ఐదుగురిపై కేసు నమోదు
ఆదోని పట్టణంలోని ఎగ్గటి ఈశ్వరప్పకు చెందిన క్రమ సంఖ్య 321-ఏలో ఉన్న 6.51 ఎకరాలను నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించయాకరి బాధితుడి ఫిర్యాదు మేరకు... సబ్ రిజిస్ట్రార్ హాజీ మియాతో పాటు సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూనియర్ అసిస్టెంట్ రమేష్, డాక్యుమెంట్ రైటర్ మహబూబ్, పొలాన్ని అమ్మిన వ్యక్తి ఆముదాల భాస్కర్, కొన్నవ్యక్తి చాకలి ఈరన్నపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు.