సంక్రాంతి సందడి
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:10 AM
మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి వేడుకలు జిల్లాలో ఘనంగా ఆరంభమయ్యాయి. సోమవారం జిల్లా ప్రజలు ‘భోగి’ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఘనంగా భోగి వేడుక
నేడు మకర సంక్రాంతి, రేపు కనుమ
కర్నూలు (కల్చరల్), జనవరి 13: మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి వేడుకలు జిల్లాలో ఘనంగా ఆరంభమయ్యాయి. సోమవారం జిల్లా ప్రజలు ‘భోగి’ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. వాడవాడలా వేకువ జామునే భోగి మంటలు వేశారు. పాతసామగ్రిని, పాత వస్తువులతో భోగిమంటల్లో వేసి కాల్చి, పాతకు స్వస్తి చెప్పి, కొత్త క్రాంతిని స్వాగతించారు. భోగి వేడుకల్లో భాగంగా కొందరు తమ పిల్లలకు భోగిపళ్లు పోసి, వారికి దిష్టితీశారు. కాగా మంగళవారం సంక్రాంతిని, బుధవారం కనుమ వేడుకలకు ప్రజలు సిద్ధమయ్యారు. రైతులు తమ ఇంట కొత్త ధాన్యంతో చేసిన పిండివంటలతో వేడుకలను ఉత్సాహ వాతావరణంలో నిర్వహించుకోనున్నారు.