కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:49 PM
కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈగల్ అధిపతి రవికృష్ణ
దేవనకొండ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ కుటుంబ సమేతంగా పాల్గొనడంతో గ్రామస్థులు తానా భవనం నుంచి కళ్యాణమండపం వరకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కబడ్డీ, బ్యాడ్మింటన్, స్లోసైక్లింగ్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతర సమావేశంలో ఈగల్ ఐజీ మాట్లాడుతూ పదేళ్ల క్రితం గ్రామంలో పరిస్థితులు దయనీయంగా ఉండేవన్నారు. నాడు తాను గ్రామాన్ని దత్తత తీసుకున్న తరువాత ఒక్కోఅడుగు ముందుకెస్తూ నేడు గ్రామంలో బ్యాంకు, కళ్యాణ మండపం, హైస్కూల్, తానా భవనం, సీసీ రోడ్లు, ఆర్వో ప్లాంటు వంటి అభివృద్ధి పనులు చేశామని, విద్యార్థులు చదువులో రాణిస్తున్నారన్నారు. 96 పొదుపు సంఘాలు ఉన్నాయన్నారు. పగలు వీడి గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటునందించాలన్నారు. యువకుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో గ్రామస్థులు మల్లికార్జున, చింపి ఈరన్న, ఎల్‌ఐసీ రాజు, చింత మధుసూదన్, సీఐ వంశీనాథ్ పాల్గొన్నారు.