Share News

ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా శివయ్య

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:07 AM

ఉపాధ్యాయ సంఘాల సమఖ్య జిల్లా అధ్యక్షుడిగా ఏపీటీఎఫ్‌257 నాయకుడు శివయ్య, ప్రధాన కార్యదర్శిగా రూట నాయకులు అబ్దుల్‌ కలాంలతో పాటు ఇతర కార్యవర్గసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా శివయ్య
సంఘీభావం తెలుపుతున్న నాయకులు

నంద్యాల ఎడ్యుకేషన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ సంఘాల సమఖ్య జిల్లా అధ్యక్షుడిగా ఏపీటీఎఫ్‌257 నాయకుడు శివయ్య, ప్రధాన కార్యదర్శిగా రూట నాయకులు అబ్దుల్‌ కలాంలతో పాటు ఇతర కార్యవర్గసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, జిల్లా ఛైర్మన్‌ మాధవస్వామి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కో చైర్మన్‌లుగా కిశోర్‌(టీటీఎఫ్‌), లక్ష్మన్‌నాయక్‌ (ఎస్టీ యూఎస్‌), డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా పీవీ ప్రసాద్‌(యూటీఎఫ్‌), నగిరి శ్రీనివాసులు(ఏపీటీఎఫ్‌1938), ట్రెజరర్‌గా అబ్దుల్‌ నజీర్‌(ఆప్ట) ఎన్నికయ్యారు. నాయకులు మాట్లాడుతూ విద్యావ్యవస్థను నాశనం చేసే జీవో నెంబరు 117ను రద్దు చేయాలని, ప్రైమరీ ఆదర్శ పాఠశాల పేరుతో సుదూర ప్రాంతాల్లోని పాఠశాలలను విలీనం చేయవద్దని కోరారు.

Updated Date - Mar 28 , 2025 | 01:07 AM