Share News

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:42 AM

అంగనవాడీ, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ ఏఐటీయూ సీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ధర్నా చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు, అంగనవాడీలు

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): అంగనవాడీ, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ ఏఐటీయూ సీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీ అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసి యేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.లలితమ్మ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.మునెప్ప మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, ఇండియన లేబర్‌ కాన్ఫరెన్సలో స్కీం వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తిస్తామని తీర్మాణం చేసిన ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించారు. తక్షణమే స్కీం కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 08 , 2025 | 12:42 AM