Share News

ఇజితెమా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:25 PM

ఆత్మకూరు పట్టణ శివార్లలోని శ్రీశైలం రస్తాలో జనవరి 7,8,9 తేదీల్లో జరగనున్న తబ్లిగీ ఇజితెమా కార్యక్రమం ఏర్పాట్లను శుక్రవారం ఎస్పీ ఆధిరాజ్‌సింగ్‌ రాణా పరిశీలించారు.

ఇజితెమా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
పార్కింగ్‌ ప్రదేశాన్ని పరిశీలిస్తున్న్ల ఎస్పీ

ఆత్మకూరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు పట్టణ శివార్లలోని శ్రీశైలం రస్తాలో జనవరి 7,8,9 తేదీల్లో జరగనున్న తబ్లిగీ ఇజితెమా కార్యక్రమం ఏర్పాట్లను శుక్రవారం ఎస్పీ ఆధిరాజ్‌సింగ్‌ రాణా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీసు అధికారులు పలు సూచనలు ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి ఇజితెమాకు ముస్లింలు భారీగా తరలి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ జామ్‌ సమస్య వాటిల్లకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముందుగానే పార్కింగ్‌ ప్రదేశాలను గుర్తించి ఆయా రూట్ల వెంట వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే పార్కింగ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఇజితెమాకు సుమారు వెయ్యి మంది వరకు పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజీనాయక్‌, అర్బన్‌ సీఐ రాము, ఎస్సై నారాయణరెడ్డి ఉన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 11:25 PM