వైభవంగా వార్షిక ఆరుద్రోత్సవం
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:07 AM
శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం వార్షిక ఆరుద్రోత్సవం వేడుకను దేవస్థానం వైభవంగా జరిపింది. పర్వదినం సందర్భంగా ఆదివారం రాత్రి 12 గంటలకు మల్లికార్జునస్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించారు.
శ్రీశైలం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం వార్షిక ఆరుద్రోత్సవం వేడుకను దేవస్థానం వైభవంగా జరిపింది. పర్వదినం సందర్భంగా ఆదివారం రాత్రి 12 గంటలకు మల్లికార్జునస్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున మంగళవాయిద్యాలు, స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించి తరువాత స్వామి, అమ్మవార్లకు ప్రాతఃకాలపూజలు జరిపించి అనంతరం అమ్మవార్లకు విశేషపూజాధికాలు, నందివాహనసేవ నిర్వహించారు. ఉత్తరద్వారమైన శివాజీ గోపురం నుంచి వెలుపలకి తీసుకువచ్చి గ్రామోత్సవం నిర్వహించారు. పుష్యశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష పుష్పార్చన నిర్వహించారు.