Share News

పత్తికొండను సస్యశ్యామలంగా మార్చడమే లక్ష్యం

ABN , Publish Date - Mar 01 , 2025 | 12:39 AM

నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చడమే లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. పత్తికొండ చెరువుకు చేరుకున్న హంద్రీనీవా నీటికి ఎమ్మెల్యే శుక్రవారం జలహారతి ఇచ్చారు.

పత్తికొండను సస్యశ్యామలంగా మార్చడమే లక్ష్యం
జలహారతి ఇస్తున్న ఎమ్మెల్యే శ్యాంబాబు

ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

హంద్రీనీవా నీటికి ఎమ్మెల్యే జలహారతి

పత్తికొండ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చడమే లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. పత్తికొండ చెరువుకు చేరుకున్న హంద్రీనీవా నీటికి ఎమ్మెల్యే శుక్రవారం జలహారతి ఇచ్చారు. హంద్రీనీవా నీటితో 68 చెరువులను నింపాలని తనతండ్రి కేఈ క్రిష్ణమూర్తి గత టీడీపీ హయాంలోనే ప్రతిపాదనలు తయారు చేసి నిధులను మంజూరు చేయించార న్నారు. అప్పటికే 60 శాతం పనులనుు కూడా పూర్తిచేశారన్నారు.

అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చెరువులకు నీటి అంశాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హాడావుడిగా పనులు పూర్తిచేసి ప్రారంభించినా చెరువులకు చుక్కనీరు చేరలేదన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పెండింగ్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, నియోజకవర్గలోని చెరువును నీటితో నింపుతోందన్నారు. 68 చెరువులకు నీరు నింపే ప్రతిపా దనలు ఎనిమిదేండ్లకు అమల య్యాయన్నారు. వర్షాధారంపై ఆధారపడ్డ పత్తికొండ నియోజకవర్గంలో వ్యవసాయ, తాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా నీటిని తరలించుకునేందుకు మరిన్ని ప్రాజెక్టులను తెచ్చేందుకు సిద్ధమవుతున్నామని అన్నారు. త్వరలోనే ప్రాజెక్టుల వివరాలు వెల్లడిస్తామన్నారు. సాంబశివారెడ్డి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, తిరుపాల్‌, శ్రీదర్‌రెడ్డి, పుండుకూరబ్రహ్మయ్య, తిక్కరమేష్‌ , రైతులు, హంద్రీనీవా అధికారులు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడిలేకుండా చర్యలు తీసుకోండి

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అధికారులకు సూచించారు. శుక్రవారం పట్ణణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సమావేశం నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూ ఎస్‌ అధికారులు తాగునీటి పథకాలలను ఎమ్మెల్యేకు వివరించారు. నియోజకవర్గంలో ఎక్కువగా బోర్లపై ఆదారపడ్డ నీటిపథకాలే ఉన్నాయని, అవి ఎండిపోతే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లు, కాలువలను నిర్మిస్తున్నామని, పారిశుధ్య పనులు చేయించాలన్నారు. వలసల నివారణ చర్యలను ఉపాధి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు నమ్మకముంచి ఎమ్మెల్యేగా గెలిపించారని నమ్మకాన్ని నిలబెట్టాలని, అధికారుల సహకారం అవసరమన్నారు. ఆర్డీవో భరత్‌నాయక్‌, డీఎల్‌డీవో అనూరాద, డీఎల్‌పీవో వీరభద్రప్ప, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2025 | 12:39 AM