Share News

తిరుపతి ఘటన బాధాకరం: టీడీపీ

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:25 AM

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల క్యూ కాంప్లెక్స్‌ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ వ్యక్తం చేశారు.

తిరుపతి ఘటన బాధాకరం: టీడీపీ
మాట్లాడుతున్న నాగేశ్వరరావు యాదవ్‌

కర్నూలు అర్బన జనవరి 9(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల క్యూ కాంప్లెక్స్‌ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ వ్యక్తం చేశారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరు మల చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరిగిన ఘటన అందరినీ కలిచి వేసిందని, సీఎం చంద్రబాబు మంత్రులను అక్కడికి పంపి బాధిత కుటుంబాలకు మెరుగైన శిక్షణ సహాయక చర్యలు అందించేం దుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్య దర్శి నాగేంద్ర, వలసల రామకృష్ణుడు, తెలుగు యువత జిల్లా అధ్య క్షుడు అబ్బాస్‌, మంచాలకట్ట భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 12:25 AM