కన్నుల పండువగా తిరుప్పావడ సేవ
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:56 AM
మామిదాల పాడులోని గోదా రంగనాథస్వామి దేవస్థానం (గోదా గోకుల క్షేత్రం) లో గురువారం నిర్వహించిన ‘తిరుప్పావడ సేవ’ కన్నుల పండువగా సాగింది.
కర్నూలు కల్చరల్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): మామిదాల పాడులోని గోదా రంగనాథస్వామి దేవస్థానం (గోదా గోకుల క్షేత్రం) లో గురువారం నిర్వహించిన ‘తిరుప్పావడ సేవ’ కన్నుల పండువగా సాగింది. తిరు మలలో శ్రీవారికి నిర్వహించే తిరుప్పావడ సేవలాగే క్షేత్రంలో రంగనాథ స్వామి వారికి విభిన్న రకాల పండ్లు, ఫలహారా లను నైవేద్యంగా సమర్పించి, ఆ నైవేద్యాలతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మారం నాగరాజ గుప్త మాట్లాడుతూ ధనుర్మాసం ముప్ప య్ రోజుల వేడుకల్లో తిరుప్పావడ సేవకు ప్రత్యేకత ఉంటుందని చెప్పారు. గోకులం మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, గోకులం సభ్యులు పాలాది సుబ్రహ్మణ్యం, ఇటిక్యాల పుల్లయ్య, బాలసుధాకర్‌లు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.