Share News

ఎంపీడీవో కావలెను

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:09 AM

మండలానికి రెగ్యులర్‌ ఎంపీడీవోను నియమించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు ఎంపీడీవోలను ఇతర జిల్లాలకు పంపి తిరిగి వారిని యాథాస్థానాలకు నియమించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంపీడీవో అల్లాబకాష్‌ను చిప్పగిరికి బదిలీ చేసి, ఆలూరుకు అమానుల్లాను నియమించారు. అయితే ఆయన బాధ్యతలు తీసుకోలేదు

ఎంపీడీవో కావలెను

ఆలూరులో రెగ్యులర్‌ అధికారి లేక ఇబ్బందులు

గాడి తప్పిన పాలన

ఆలూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మండలానికి రెగ్యులర్‌ ఎంపీడీవోను నియమించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు ఎంపీడీవోలను ఇతర జిల్లాలకు పంపి తిరిగి వారిని యాథాస్థానాలకు నియమించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంపీడీవో అల్లాబకాష్‌ను చిప్పగిరికి బదిలీ చేసి, ఆలూరుకు అమానుల్లాను నియమించారు. అయితే ఆయన బాధ్యతలు తీసుకోలేదదు. దీంతో సూపరింటెండెంట్‌ రమా దేవికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. నెలకే తాను బాధ్యతలు నిర్వహించలేనని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దేవనకొండ ఈవో ఆర్డీ సూర్యనారాయణను ఇన్‌చార్జి ఎంపీడీవోగా నియమించారు. ఇక్కడ సిబ్బంది కొరత ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. సీనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ పోస్ట్‌తో పాటు నలుగురు పంచాయతీ కార్యాదర్శుల పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీంతో ఇక్కడ చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 08 , 2025 | 01:09 AM