పొదుపు మహిళల అభివృద్ధికి కృషి చేస్తాం
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:17 AM
జిల్లాలో నాబార్డు సౌజన్యంతో గ్రామాల్లోని పొదుపు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం. సుబ్బారెడ్డి అన్నారు.
నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం. సుబ్బారెడ్డి
మద్దికెర, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాబార్డు సౌజన్యంతో గ్రామాల్లోని పొదుపు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం. సుబ్బారెడ్డి అన్నారు. గురువారం నాబార్డు నిధులతో నిర్మించిన కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ జిల్లాలోని డ్వాక్రా మహిళలు వ్యాపార సముదాయాలు నిర్మించుకోవడానికి డీఆర్‌డీఏకి రూ.3.50 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో నాబార్డు సౌజన్యంతో గోసానిపల్లె, దొర్నిపాడు గ్రామాలతో పాటు మద్దికెరలో మూడు కూరగాయల మార్కెట్లు నిర్మించినట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలు వ్యాపారం చేసుకోవడానికి రూ.7 లక్షలతో ఉచితంగా గదులు నిర్మించి ఇస్తామని తెలిపారు. గ్రామ వికాస్ నిధుల కింద గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో వీరభద్రప్ప, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, సర్పంచ్ సుహాసిని, బొమ్మనపల్లి ఆంజనేయులు, మదనంతపురం శ్రీనివాసులు, మాజీ ఉప సర్పంచ్ శ్రీరాములు, వి. నాగేశ్వరరెడ్డి, మెడికల్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.