Share News

పని వేళలు పాటించకపోతే ఎలా?

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:38 AM

మూడు నెలలకు ఓ సారి జరిగే మండల సమావేశానికి అధికారులు సమయ పాలన పాటించకపోతే ఎలా అని ఎంపీపీ శ్రీవిద్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

పని వేళలు పాటించకపోతే ఎలా?
మాట్లాడుతున్న ఎంపీపీ శ్రీవిద్య

అధికారులపై ఎంపీపీ ఆగ్రహం

పెద్దకడబూరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): మూడు నెలలకు ఓ సారి జరిగే మండల సమావేశానికి అధికారులు సమయ పాలన పాటించకపోతే ఎలా అని ఎంపీపీ శ్రీవిద్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పెద్దకడ బూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా గత నెలలో ఆనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీపీ హనుమంతు రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి ఆర్పించా రు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ సర్వసభ్య సమావేశ నియమ నిబ ంధనలు గాలికోదిలేశారని, అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించా రు. అనంతరం హనుమాపురం ఎంపీటీసీ నరవ శశిరేఖ మాట్లాడుతూ గత సర్వసభ్య సమావేశంలో తెలిపిన సమస్యలు నేటికి పరిష్కరించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు అడిగినా సమస్యలు పరిష్కారం చేయ కపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. హెచ మురవణి ఎంపీటీసీ బేబి మాట్లాడుతూ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రా లలో ప్రభుత్వం అందించే గుడ్లు, పాల ప్యాకెట్లును కార్యకర్తలు బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో అనాధికార వ్యక్తులు పాల్గొన్న అధికారులు ప్రశ్నించకపోవ డం గమనార్హం. ఈ సమావేశంలో తహసీల్దార్‌ శ్రీనాథ్‌, ఎంపీడీవో జయ రాముడు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు రామాంజినేయులు, చంద్రశేఖర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:38 AM