Share News

ప్రైవేటు లాడ్జిల ధరలకు రెక్కలు

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:16 AM

మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధానంలో కొత్త సంవత్సరం మొదటిరోజును గడుపుదామనుకున్న భక్తులకు ప్రైవేటు లాడ్జిల యజ మానులు నిలువుదోపిడీకి గురి చేశారు.

ప్రైవేటు లాడ్జిల ధరలకు రెక్కలు
మధ్వమార్గ్‌ కారిడార్‌

గంటకో రేటు.. రూ.400ల రూము రూ.12వేలు

భక్తుల నుంచి నిలువుదోపిడీ

మంత్రాలయం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధానంలో కొత్త సంవత్సరం మొదటిరోజును గడుపుదామనుకున్న భక్తులకు ప్రైవేటు లాడ్జిల యజ మానులు నిలువుదోపిడీకి గురి చేశారు. రూ.400లు అద్దె ఉన్న గదిని ఏకంగా రూ.12వేలు పెంచి భక్తుల నుంచి ముక్కు పిండి వసూలు చేశారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం రాత్రి వరకు భక్తుల రద్దీని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు లాడ్జిల యజ మానులు అమాంతరంగా రేట్లను పెంచేశారు. ఇంత ఎక్కువ డబ్బులు చెల్లించలేని సాధారణ భక్తులు మధ్వమార్గ్‌ కారిడార్‌లో పిల్లాపాపలను తల్లిదండ్రులు వణుకుతూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొంత మంది ఇళ్లను సైతం లాడ్జిలుగా మార్చేసి సొమ్ము చేసుకున్నారు. ఉన్న ఇంట్లోనే స్నానానికి రూ.200ల ప్రకారం ఇవ్వడం మొదలు పెట్టారు. మరికొందరు ఎమ్మిగనూరు, ఆదోని, రాయచూరు, కర్నూలులో గదులను అద్దెకు తీసుకుని తెల్లవారుజామున వచ్చి రాఘవేంద్రస్వామిని దర్శించుకుని వెళ్లారు. అధికారులు స్పందించి మంత్రాలయంలో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ధరలను సవరించాలని కోరుతున్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:16 AM