Share News

Yanam : కొత్త అల్లుడికి 470 రకాల వంటలతో విందు

ABN , Publish Date - Jan 14 , 2025 | 04:00 AM

గోదావరి జిల్లాలు అంటేనే ఆతిథ్యానికి పెట్టిందిపేరు. కొత్త అల్లుడు వస్తే ఆ సందడే వేరు...

 Yanam : కొత్త అల్లుడికి 470 రకాల వంటలతో విందు

Andhra Jyothy : గోదావరి జిల్లాలు అంటేనే ఆతిథ్యానికి పెట్టిందిపేరు. కొత్త అల్లుడు వస్తే ఆ సందడే వేరు. తూర్పు గోదావరి జిల్లాతో కలిసి ఉండే... కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో సోమవారం కొత్త అల్లుడికి అత్తింటివారు 470 రకాల వంటలతో మెగా విందు ఏర్పాటు చేశారు. యానాం వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్‌ వెంకటేశ్వర్‌, వెంకటేశ్వరి దంపతుల ద్వితీయ కుమార్తె హరిణ్యకు గత ఏడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్‌తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి, ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.470 రకాల వంటలతో అల్లుడు, కుమార్తెకు ఘనంగా విందు ఇచ్చారు.

- యానాం, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 14 , 2025 | 04:00 AM