MLA MS Raju : వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో చర్చకు సిద్ధమా?
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:35 AM
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో, దళితుల కు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైసీపీ నేతలకు సవాలు విసిరారు.

వైసీపీ నేతలకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్
అనంతపురం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో, దళితుల కు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైసీపీ నేతలకు సవాలు విసిరారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాల, మాదిగ, ఇతర ఉప కులాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే... స్వాగతించాల్సింది పోయి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు హయాంలో 2014-19 వరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధి, దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎన్ని వేల కోట్ల ఖర్చు చేశామో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.