Nellore Rural Constituency: వీధి వీధికి స్కూటర్‌పై ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:51 AM
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 609 అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కూటర్‌పై ప్రయాణించి, ఆకస్మికంగా పనుల పరిశీలన చేపడుతున్నారు.

Nellore : చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా చూసేందుకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. స్కూటర్ ఎక్కి పనుల పరిశీలన చేపట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 609 పనులు ఏకకాలంలో ప్రారంభించిన ఎమ్మెల్యే... వాటిని మే 20 నాటికి పూర్తి చేసి టీడీపీ కార్యకర్తలతో ప్రారంభోత్సవాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ దశల్లో ఉన్న ఈ పనుల పురోగతిని శ్రీధర్‌రెడ్డి ఏరోజుకారోజు పరిశీలిస్తున్నా రు. హంగు ఆర్భాటాలకు దూరంగా స్కూటర్‌పై ప్రయాణిస్తూ ఆకస్మిక పరిశీలన చేస్తున్నారు. హెల్మెట్ ధరించి.. స్కూటర్ వెనుక కూర్చుని వెళ్తూ సోమవారం ‘ఆంధ్రజ్యో తి’ కెమెరాకు చిక్కారు.
- నెల్లూరు రూరల్, ఆంధ్రజ్యోతి
For AndhraPradesh News And Telugu News