Share News

నాలా చట్టం రద్దుకు త్వరలో రూల్స్‌ : అనగాని

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:53 AM

నాలా చట్టం రద్దుపై త్వరలో విధివిధానాలు విడుదల చేస్తామని రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. నారెడ్కో ప్రతినిధులు మంత్రి సత్యప్రసాద్‌ను కలసి ఆయన కృషికి సత్కారంగా శాలువా కప్పి సత్కరించారు

నాలా చట్టం రద్దుకు త్వరలో రూల్స్‌ : అనగాని

విజయవాడ(వన్‌టౌన్‌), మార్చి 27 (ఆంధ్రజ్యోతి): నాలా (నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసె్‌సమెంట్‌) చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామని రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ర్టేషన్ల శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఈ చట్టాన్ని రద్దు చేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాల్టీ సంస్ధ అయిన నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (నారెడ్కో) ప్రతినిధులు గురువారం అమరావతి సచివాలయంలో మంత్రిని కలిశారు. నాలా చట్టం రద్దు వెనుక ఆయన కృషి ఎంతో ఉందన్నారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఆయన్ను కలిసిన వారిలో నారెడ్కో సంస్ధ ప్రతినిధులు గద్దె చక్రధర్‌, కిరణ్‌ పరుచూరి, దుర్గాప్రసాద్‌, సీతారామయ్య, జగన్‌, నాగవంశీ, పాపారావు ఉన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 04:53 AM