Home » Anagani Satya Prasad
Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో రెండు పథకాలైన అమ్మ ఒడి, ఉచిత బస్సు పథకానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించండం సంతోషకర విషయమన్నారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేందుకు నీటిపారుదల శాఖకు గత ప్రభుత్వం కంటే రెండు రెట్ల అదనపు నిధులు...
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనతోపాటు రాష్ట్రంలోని పలు అంశాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గొప్ప మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భూములు కబ్జా చేసే వారి గుండెల్లో ఈ చట్టం రైళ్లు పరిగెత్తిస్తుందని చెప్పారు.
జగన్ ప్రభుత్వంలో హార్టికల్చర్ , డ్రిప్ ఇరిగేషన్ వంటివి అన్నింటినీ గాలికొదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాయలసీమ బిడ్డ అని చెబుతూనే ఇరిగేషన్‌ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.
Andhrapradesh: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు శ్రీవారి సేవలో తరించారు. మంత్రులకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. దర్శనానంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాలను వారికి అందజేశారు. అలాగే నిర్మాత నాగ వంశీ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Andhrapradesh: కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లలో 2 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. పట్టించుకోని జగన్ శాంతిభద్రతలపై మాట్లాడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.
భక్తుల మనోభావాలు గౌరవించి జగన్‌ను డిక్లరేషన్ ఇవ్వమంటే దేశం, హిందూయిజం మీద దాడి చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్‌ది కృరత్వమని విమర్శించారు. జగన్‌ది మానవత్వం కాదు.. కృరత్వమని ఎద్దేవా చేశారు. కల్తీ లడ్డు వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక జగన్ వంకర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
అమరావతి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై రాజరికపు పొకడలకు స్వస్తి పలకనుంది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయాలు తీసుకోనుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా, మంత్రి అనగని సత్య ప్రసాద్ ప్రతిపాదనలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూసి ప్రజలు బాధపడుతున్నారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 11సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని ప్రజలు బాధపడే పరిస్థితిని ఆయన కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.
వరదనీటితో ఒలేరు కట్ట నిండుతోంది. కట్ట రక్షణకు చర్యలు తీసుకున్నారు. రేపల్లె పట్టణ ప్రజలు సరక్షితం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. రేపల్లె మండలంలో గల వరద ప్రభావిత ప్రాంతాలు పెనుమూడి, రావి అనంతవరం, ఒలేరు గ్రామాల్లో అర్ధరాత్రి వరకు మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి పర్యటించారు.