Share News

KGBV: కేజీవీబీ ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం.. ఎప్పటి నుంచంటే..

ABN , Publish Date - Mar 19 , 2025 | 05:40 PM

KGBV: అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, బీపీఎల్ పరధిలో ఉన్న కుటుంబాలకు చెందిన బాలికలు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.

KGBV: కేజీవీబీ ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం.. ఎప్పటి నుంచంటే..
KGBV Students in Class Room

అమరావతి,మార్చి 19: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు వెల్లడించారు. మార్చి 22వ తేదీ నుంచి ఈ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 352 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఈ విద్య సంవత్సరానికిగాను 6, 11 తరగతల్లో ప్రవేశాల కోసం.. అలాగే 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వివరించారు. ఈ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 11 వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని శ్రీనివాసరావు పేర్కొన్నారు.


అనాథలు, బడి బయట పిల్లలు, బడి మానేసిన వారు (డ్రాపౌట్స్‌), పేద ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ, దారిద్య రేఖకు దిగువున (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు చెందిన బాలికలు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తులు https://apkgbv.apcfss.in ద్వారా పొంద వచ్చని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుందన్నారు. పూర్తి వివరాలు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చనని.. ఇతర ఏమైనా సందేహాలకు ఉంటే.. 70751-59996, 70750-39990 నంబర్లకు సంప్రదించాలని అర్హులైన బాలికలకు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు సూచించారు.

ఇవి కూడా చదవండి..

Central Cabinet Meeting : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Reduce Obesity Tips: ఊబకాయాన్ని తగ్గించుకోనేందుకు.. జస్ట్ ఈ చిట్కాలు..

Summer Tips: వేసవిలో.. ఉదయం వీటిని టిఫిన్‌గా తీసుకోండి.. అదిరిపోద్ది

For AndhraPradesh New And Telugu News

Updated Date - Mar 19 , 2025 | 05:53 PM