Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:26 AM
సినిమా వేరు, రాజకీయాలు వేరు.. నువ్వు రాజకీయాలకు పనికి రావు.. అంటే పవన్ ఊరుకుంటాడా.. ఎక్కడ నెగ్గాలో ... ఎక్కడ తగ్గాలో తెలిసిన మనిషికి సినిమాలు.. రాజకీయాలు వేరు కాదు.. దేన్నైనా పట్టి మెడలు వంచి దారికి తెచ్చుకోవటమే ఆయనకు తెలుసు...

కేజీఎఫ్ 2 సినిమాలో ఓ డైలాగ్ ఉంది.. ‘ హిస్టరీ టెల్స్ అజ్, ద పవర్‌ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్‌ఫుల్ ప్లేసెస్.. హిస్టరీ వాజ్ రాంగ్, పవర్‌ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్‌ఫుల్’ ఈ డైలాగ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ, రాజకీయ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. సినిమాల్లో హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఏ హీరోకు లేనంత క్రేజ్ సంపాదించుకున్నారు. ప్లాప్ సినిమాకు కూడా కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన స్టామినా పవన్‌కు మాత్రమే సొంతం. అలాంటి పవన్ రాజకీయాల్లో ఎన్నో డక్కాముక్కీలు తిన్నారు. ఎన్నో అవమానాలు భరించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో తిరుగులేని గెలుపును సొంతం చేసుకున్నారు. ‘నువ్వ రాజకీయాలకు పనికి రావు’ అన్న నోళ్లను మూయించటం కాదు.. అసెంబ్లీ గేటు కూడా తాకకుండా చేశారు. రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారు.
పవన్ కాదు.. పొలిటికల్ తుఫాన్
2024 ఎన్నికల్లో జనసేన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచి ఓ రికార్డు సృష్టించింది. ఈ గెలుపును చూసి ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోదీనే ఆశ్చర్యపోయాడు. ఓ రాజకీయ కార్యక్రమంలో.. తలలు పండిన దిగ్గజ రాజకీయ నేతల ముందు పవన్‌ను ‘ పవన్ కాదు.. తుఫాన్’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. దేశ రాజకీయాలు మొదలైన నాటి నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి అంటే.. నామ మాత్రమే అని చెప్పాలి. మంత్రులకు ఉన్న క్రేజ్ కూడా డిప్యూటీ సీఎంకు ఉండేది కాదు. పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవికి అలంకారం వచ్చింది. అలంకారం మాత్రమే కాదు.. గుర్తింపు కూడా వచ్చింది. ఎంతలా అంటే.. డిప్యూటీ సీఎం అని అంటే.. బాలీవుడ్ స్టార్లు కూడా పవన్ కల్యాణ్ పేరు చెప్పేంతలా.
మనసున్న మారాజు..
కోట్ల రూపాయల సంపాదన ఉన్నా.. కొంతమంది తమ జేబిలోంచి ఓ పది రూపాయలు తీసి దానం చేయడానికి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ, పవన్ అలా కాదు.. కష్టం అంటే ముందుంటాడు. అప్పులు చేసి మరీ దానాలు చేస్తుంటారు. సినిమా కెరీర్ మొదలైన నాటి నుంచి పవన్ చేసిన దాన ధర్మాలకు లెక్కే లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది మరింత పెరిగింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు కోట్ల రూపాయలు పంచారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. కొన్ని వందల కుటుంబాలకు ఆయన డబ్బులు పంపిణీ చేశారు. ఇదంతా తన సొంత డబ్బులతో చేశారు. పాపం, తన పిల్లల కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బులు కూడా కౌలు రైతులకు వాడేశారు. గత సంవత్సరం ఏపీ, తెలంగాణ వరదల సమయంలో కూడా ఏకంగా 6 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. గత ఫిబ్రవరి నెలలో ఎన్టీఆర్ ట్రస్ట్‌కు ఏకంగా 50 లక్షల విరాళాన్ని అందించారు. తన సినిమా సంపాదనను మొత్తం ఇలా దాన ధర్మాలు చేయడానికి ఖర్చు చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
Trains: రైల్వే ప్రయాణికులకో గుడ్ న్యూస్.. అందేంటంటే..
Bandi Sanjay: 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా పట్టదా?
Raja Singh: ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here