Share News

జిల్లాలో 18,19,448 మంది ఓటర్లు

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:28 PM

జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,19,448 మందికి చేరింది. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదివారం తుది జాబితాను ప్రచురించారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 2,183 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో పురుష ఓటర్లు 9,05,88 మంది, మహిళా ఓటర్లు 9,13,450 మంది, థర్డ్‌ జండర్లు 113 మంది ఉన్నారు. అదనంగా సర్వీసు ఓటర్లు 6,655 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 7,465 మంది ఎక్కువ.

జిల్లాలో 18,19,448 మంది ఓటర్లు

కనిగిరి నియోజకవర్గం ఫస్ట్‌..

ఎర్రగొండపాలెం లాస్ట్‌

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,19,448 మందికి చేరింది. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదివారం తుది జాబితాను ప్రచురించారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 2,183 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో పురుష ఓటర్లు 9,05,88 మంది, మహిళా ఓటర్లు 9,13,450 మంది, థర్డ్‌ జండర్లు 113 మంది ఉన్నారు. అదనంగా సర్వీసు ఓటర్లు 6,655 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 7,465 మంది ఎక్కువ. జిల్లాలో అత్యఽధికంగా కనిగిరి నియోజకవర్గంలో 2,40,356 మంది, అత్యల్పంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో 2,06,286 మందికి ఓటు హక్కు ఉంది. ఎర్ర గొండపాలెం, దర్శి; మార్కాపురం నియోజకవర్గాల్లో స్వల్పంగా పురుషుల ఓట్లు అధికంగా ఉన్నాయి. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే పైచేయి.

జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

నియోజకవర్గం పేరు పోలింగ్‌ పురుష మహిళా ధర్డ్‌జెండర్‌ మొత్తం

కేంద్రాలు ఓటర్లు ఓటర్లు ఓటర్లు

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------

యర్రగొండపాలెం 265 1,04,711 1,01,573 02 2,06,286

దర్శి 282 1,14,086 1,12,137 08 2,26,231

సంతనూతలపాడు 256 1,04,995 1,08,823 06 2,13,824

ఒంగోలు 259 1,15,058 1,24,417 52 2,39,527

కొండపి 283 1,18,367 1,20,878 03 2,39,248

మార్కాపురం 257 1,07,770 1,06,473 08 2,14,251

గిద్దలూరు 284 1,19,435 1,20,268 22 2,39,725

కనిగిరి 297 1,21,463 1,18,881 12 2,40,356

----------------------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 2183 9,05,885 9,13,350 113 18,19,448

Updated Date - Jan 05 , 2025 | 11:29 PM