Share News

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:10 AM

పట్టణంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల లో ఆదివారం 1979-80 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వవిద్యార్థుల సమ్మే ళనం నిర్వహించారు.

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

మార్కాపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల లో ఆదివారం 1979-80 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వవిద్యార్థుల సమ్మే ళనం నిర్వహించారు. సుమారు 44 సంవత్స రాల తర్వాత అందరూ ఒక వేదికపై వచ్చి గతస్మృతులను నెమరవేసుకున్నారు. ఉద్యోగ, వ్యాపారరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడి వాళ్లు కూడా దశాబ్ధాల తర్వాత కలవడంతో ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని తన్మయత్వంలో మునిగి తేలారు. ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కదం శ్రీనివాసరావు, సోమయాజుల సుబ్బశాస్త్రి, సుభాని, గుప్తాప్రసాద్‌, ఆర్‌వీఎస్‌ ప్రసాద్‌, బండి శ్రీనివాసరావు, దేసు వెంకటప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 12:10 AM