అట్టహాసంగా వేడుకలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 10:49 PM
కనిగిరిలోని అమరావతి గ్రౌండ్స్‌లో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఉగ్రకు శుభాకాంక్షలు చెప్పారు.
కనిగిరి అమరావతి గ్రౌండ్స్‌లో పోటెత్తిన టీడీపీ అభిమానం
పూలదండలు, బొకేలకు పెట్టే ఖర్చును ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి ఇవ్వాలని ఎమ్మెల్యే ఉగ్ర పిలుపు
తొలుత హుండీలో రూ.50 వేల విరాళం వేసి ప్రారంభం
స్పందించిన టీడీపీ శ్రేణులు
కనిగిరి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : కనిగిరిలోని అమరావతి గ్రౌండ్స్‌లో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఉగ్రకు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో అమరావతి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. అంతేగాక వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పూలదండలు, శాలువాలకు పెట్టే ఖర్చును స్థానిక ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి విరాళాల రూపంలో ఇవ్వాలని ఇచ్చిన పిలుపు నేపథ్యంలో స్పందన వచ్చింది. తొలుత ఎమ్మెల్యే తన సొంత నగదు రూ.50వేలను హుండీలో వేశారు. ఆ తర్వాత శ్రేణులు కూడా విరాళాలు ఇచ్చాయి. తొలుత ఎమ్మెల్యే ఉగ్ర పట్టణంలోని పలు దేవాలయాలకెళ్లి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, వీవీఆర్ మనోహరరావు, నారపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి, గంగవరపు నాగిరెడ్డి, కమతం వెంకటేశ్వర్లు, గుదే రమణయ్య, జంషీర్, సిద్దాంతి బారాయిమాం, గుడిపాటి ఖాదర్, అహ్మద్, షరీఫ్, రోషన్‌సందాని, తెలుగు మహిళలు కరణం అరుణ, షేక్ వాజిదాబేగం పాల్గొన్నారు.