Share News

పోటాపోటీగా క్రికెట్‌

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:06 PM

రావినూతలలోని రావినూతల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ భ్రమర సంక్రాంతి కప్‌-2025 క్రికెట్‌ పోటీల ఆసక్తి కరంగా సాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఏలూరిస్‌ సౌత్‌ జోన్‌ సీసీ లెవెన్‌ చెన్నై, లైన్స్‌ సీసీ బెంగళూరు జట్ల మధ్య పోటీ జరిగింది.

పోటాపోటీగా క్రికెట్‌
బ్యాట్స్‌మన్‌ను స్టంప్‌ అవుట్‌ చేస్తున్న వికెట్‌ కీపర్‌

విజయం సాధించిన ఏలూరిస్‌ సౌత్‌ జోన్‌

సీసీ లెవెన్‌ చెన్నై, జీఎ్‌సటీ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ లెవెన్‌ చెన్నై జట్లు

మేదరమెట్ల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : రావినూతలలోని రావినూతల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ భ్రమర సంక్రాంతి కప్‌-2025 క్రికెట్‌ పోటీల ఆసక్తి కరంగా సాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఏలూరిస్‌ సౌత్‌ జోన్‌ సీసీ లెవెన్‌ చెన్నై, లైన్స్‌ సీసీ బెంగళూరు జట్ల మధ్య పోటీ జరిగింది. లైన్స్‌ సీసీ బెంగళూరు జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఏలూరిస్‌ సౌత్‌ జోన్‌ సీసీ లెవెన్‌ చెన్నై బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు సాధించింది. ఏలూరిస్‌ జట్టులోని ఆల్‌ రౌండర్‌ శర్వణ 9 బంతులలో 2 సిక్స్‌లతో 20 పరుగులు సాధించాడు. 4 ఓవర్లు బౌల్‌చేసి 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బౌలర్‌ మోసెస్‌ 4ఓవర్లు బౌల్‌చేసి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లైన్స్‌ జట్టు 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జట్టులోని నందకిషోర్‌ 45 బంతులలో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 65 పరుగులు సాధించాడు. లైన్స్‌ సీసీ బెంగళూరు జట్టుపై ఏలూరిస్‌ సౌత్‌ జోన్‌ సీసీ లెవెన్‌ చెన్నై జట్టు ఒక్క పరుగుతో విజయం సాధించింది. సాయంత్రం జరిగిన పోటీలలో జీఎ్‌సటీ అండ్‌ సీఈ లెవెన్‌ చెన్నై, వైట్‌ ఫీల్డ్‌ సీఏ లెవెన్‌ బెంగళూరు జట్లు మధ్య పోటీ జరిగింది. వైట్‌ ఫీల్డ్‌ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 17.1 ఓవర్లలో 10వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జీఎ్‌సటీ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ లెవెన్‌ చెన్నై జట్టు 9.2 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. జీఎ్‌సటీ బౌలర్‌ హరీష్‌ రెండు మిడిన్‌ ఓవర్లతో కలిపి 4 ఓవర్లు బౌల్‌చేసి 5 పరుగులు ఇచ్చి 3వికెట్లు తీశాడు. మరో బౌలర్‌ చంద్రశేఖర్‌ 4 ఓవర్లు బౌల్‌చేసి 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జీఎ్‌సటీ అండ్‌ సీఈ లెవెన్‌ జట్టు 5 వికెట్లు తేడాతో వైట్‌ ఫీల్డ్‌ సీఏ లెవెన్‌ జట్టుపై విజయం సాధించింది. ఈ పోటీలకు ఎంపైర్‌లుగా శ్రీనివాస్‌, రాజా, స్కోరర్‌గా సాయిరాజ్‌ వ్యహరించారు.

నేటి పోటీల వివరాలు

రావినూతల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి కప్‌ క్రికెట్‌ పోటీలలో సోమవారం ఉదయం ఏలూరిస్‌ సౌత్‌ జోన్‌ సీసీ చెన్నై, ఇండియన్‌ బ్యాంక్స్‌ అండ్‌ ఆర్‌సీ చెన్నై జట్లు మధ్య పోటీ జరుగుతుంది. సాయంత్రం ఎస్‌కేఎం సీసీ లెవెన్‌ చెన్నై, జీఎ్‌సటీ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ లెవెన్‌ చెన్నై జట్లు మధ్య పోటీ జరుగుతుందని అసోసియేసన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కారుసాల నాగేశ్వరావు(బాబు), మోపర్తి శేషు తెలిపారు.

Updated Date - Jan 12 , 2025 | 11:06 PM