వైసీపీ హయాంలో పాడి పరిశ్రమ నిర్వీర్యం
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:47 PM
గత వైసీపీ పాలనలో పాడి రంగం పూర్తిగా నిర్వీర్యమైందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మం డలంలోని చినఇర్లపాడు గ్రామంలో ఆదివారం గోకులం షెడ్‌లను ఆయన ప్రారంభించారు. ఈసం దర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పాడి రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. పాడి రంగంపై ఆధారపడి జీవించే వారికి తగిన ప్రోత్సాహం కరువైందన్నారు. దీంతో చాలా మంది రైతులు పాడిరంగాన్ని విడిచి పెట్టారన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో పాడి రంగం పూర్తిగా నిర్వీర్యమైందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మం డలంలోని చినఇర్లపాడు గ్రామంలో ఆదివారం గోకులం షెడ్‌లను ఆయన ప్రారంభించారు. ఈసం దర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పాడి రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. పాడి రంగంపై ఆధారపడి జీవించే వారికి తగిన ప్రోత్సాహం కరువైందన్నారు. దీంతో చాలా మంది రైతులు పాడిరంగాన్ని విడిచి పెట్టారన్నారు. పాడి, పంట సమృద్ధిగా ఉంటేనే అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. ఈక్రమంలో కూటమి ప్ర భుత్వంలో సీఎం చంద్రబాబు పాడిరంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పశువుల పెంప కందారుల ప్రోత్సాహానికి 90శాతం సబ్సిడీతో పశువుల పెంపకానికి ప్రధానంగా అవసరమైన షెడ్‌ల నిర్మాణాని కి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. కేవలం పది శాతం మాత్రమే రైతు వాటా కింద తీసుకుని 90శాతం సబ్సిడీ తో ఉపాధి హామీ పథకం కింద రుణాలు అందిస్తున్న ట్టు చెప్పారు. గోకులం షెడ్‌లను నిర్మించుకున్న రైతులకు గేదెలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి సబ్సిడీపై ఇచ్చేందుకు తగిన కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే కనిగి రి ప్రాంతంలో అత్యధికంగా పశుపోషకుల కోసం గోకు లం షెడ్‌ల నిర్మాణానికి ని ధులు సమీకరించినట్టు చె ప్పారు.
అనంతరం బొమ్మిరెడ్డి పల్లి పంచాయతీ పరిధిలోని గుండ్లపాలెంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జోసఫ్, ఎంపీడీవో హనుమంతరావు, ఎం పీపీ దంతులూరి ప్రకాశం, నాయకులు యడవల్లి శ్రీని వాసులురెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.