బ్రిడ్జిలపై భయం..భయం!
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:07 PM
భయం..భయంగా ప్రయాణికులు బ్రిడ్జిలపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ పక్క బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరాయి. మరోపక్క బ్రిడ్జి అంచుల్లోని గోడలకు చిల్లచెట్లు కమ్మేశాయి. వానాకాలంలో బ్రిడ్జిపై నీరు చేరి రోజులతరబడి నిలిచి ఉంటుంది. ఇలాగే కొనసాగితే బ్రిడ్జి కూలే ప్రమాదముందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పిడుగురాళ్ల - వాడరేవు జాతీయ రహదారి రోడ్డు పను లు సాగుతుండడంతో వందల సంఖ్యలో భారీ వాహనాలు ఈబ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. టన్నులకొద్దీ రోడ్డు సామగ్రిని బ్రిడ్జి మీదుగా తరలిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
శిథిలావస్థలో వారధులు
గోడల్లో మొలిచిన చిల్లచెట్లు
పాత మద్రాసు రోడ్డులోనూ అదే పరిస్థితి
భారీ వాహనాలు, ప్రయాణికులతో రద్దీ
పొంచి ఉన్న ప్రమాదం
పట్టించుకోని అధికారులు
పర్చూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : భయం..భయంగా ప్రయాణికులు బ్రిడ్జిలపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ పక్క బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరాయి. మరోపక్క బ్రిడ్జి అంచుల్లోని గోడలకు చిల్లచెట్లు కమ్మేశాయి. వానాకాలంలో బ్రిడ్జిపై నీరు చేరి రోజులతరబడి నిలిచి ఉంటుంది. ఇలాగే కొనసాగితే బ్రిడ్జి కూలే ప్రమాదముందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పిడుగురాళ్ల - వాడరేవు జాతీయ రహదారి రోడ్డు పను లు సాగుతుండడంతో వందల సంఖ్యలో భారీ వాహనాలు ఈబ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. టన్నులకొద్దీ రోడ్డు సామగ్రిని బ్రిడ్జి మీదుగా తరలిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాత మద్రాసు రోడ్డులో ఇంకొల్లు మండలం పూసపాడు వద్ద అర్‌అండ్‌బీ రహదారిపై బ్రిడ్జి శిథిలమై కూలే దశకు చేరింది. దశకు చేరుకుంది. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, డైవర్షన్‌తో సరిపెట్టారు. ఏళ్లు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణం ఊసే లేవు. కొద్దిపాటి వర్షం కురిసినా రాకపోకలు నిలచిపోల్సిందే. నిత్యం వందల సంఖ్యలో వాహనాలతో రాకపోకలు సాగించే పర్చూరు - ఇంకొల్లు (పాత మద్రాస్) రోడ్డులో బ్రిడ్జి పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి తోడు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డ్రైవర్షన్ రోడ్డు కూడా అస్తవ్యస్తంగా మారింది. అమరావతికి వెళ్లే వారు ఇంకొల్లు - పర్చూరు మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంది. పర్చూరు ఆయా పట్టణాలకు ప్రధాన కూడలి కావడం, రాజధాని అమరావతికి వెళ్లే మార్గం కూడా కావడంతో ఈ బ్రిడ్జిపై వాహనాల రద్దీ ఎక్కువైంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పర్చూరు వాగుపై బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి గోడలను చీల్చుకుంటూ పిచ్చి మొక్కలు వస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడిపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.