ఆరు నెలల్లో సంక్షోభం నుంచి సంక్షేమం వైపు
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:53 PM
జగన్‌రెడ్డి పాలనలో సంక్షోభంలోకి రాష్ట్రా న్ని, గాడి తప్పిన పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు నెలల కాలంలోనే సం క్షేమం దిశగా మళ్లించారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శనివా రం ఇంకొల్లులో సుమారు రూ.80లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఏలూ రి ప్రారంభించారు. ఇంకొల్లులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పోలీసు అవుట్ పోస్టును ఆయన ప్రారంభించారు.
ఎమ్మెల్యే ఏలూరి
రూ.80లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, పోలీస్ అవుట్‌పోస్టుకు ప్రారంభోత్సవాలు
ఇంకొల్లు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : జగన్‌రెడ్డి పాలనలో సంక్షోభంలోకి రాష్ట్రా న్ని, గాడి తప్పిన పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు నెలల కాలంలోనే సం క్షేమం దిశగా మళ్లించారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శనివా రం ఇంకొల్లులో సుమారు రూ.80లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఏలూ రి ప్రారంభించారు. ఇంకొల్లులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పోలీసు అవుట్ పోస్టును ఆయన ప్రారంభించారు. అనంతరం బస్టాండులో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పాలేరు రామకృష్ణ నిర్మించిన మదర్ ఫీడింగ్ రూంను ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఏలూ రి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు ఆరు నెలల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయని, ఆ సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడం చంద్రబాబుకే సాధ్యమవుతుందన్నారు. సినిమా హాలు సెంటర్, స్టాలిన్‌పేట, అంకమ్మకాలనీ వద్ద సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏలూరి వైసీపీ ఐదేళ్లలో ఎక్కడా సీసీ రోడ్డును కూడా నిర్మించలేదని, కూటమి వచ్చిన ఆరు నెలల్లోనూ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం సాగుతోందన్నారు. నియోజకవర్గంలో ఆరు మండాలల్లో రూ.3.30కోట్లతో సీసీ రో డ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.9కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులు చేపట్టారన్నారు. రూ.50లక్షలతో కొమ్మమూరు మరమ్మతులతో సాగునీరు అం దించేందుకు చర్యలు చేపట్టామని ఏలూ రి తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయకుమార్, మండల పార్టీ అధ్యక్షుడు నాయుడు హ నుమంతరావు, టౌన్ అధ్యక్షుడు మార్క్, పాలేరు రామకృష్ణ, కరి శ్రీను, రోటరీ గవర్నర్ కే శరత్‌చౌదరి పాల్గొన్నారు.