Share News

కేజీబీవీ విద్యాలయంలో తనిఖీ

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:32 AM

ప్రతి విద్యార్థిని క్రమ శిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తే భవిష్యత్‌కు పునాది వేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.పురుషోత్తం అన్నారు. గత నెల 27వ తేదీన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ‘విద్యార్థులకు వంట కష్టాలు’ శీర్షికన ఆంరఽధజ్యోతిలో వచ్చిన వార్తపై డీఈవో స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారం కేజీబీవీ విద్యాలయాన్ని తనిఖీ చేశారు.

కేజీబీవీ విద్యాలయంలో తనిఖీ
విద్యార్థినులతో మాట్లాడుతున్న డీఈవో పురుషోత్తం

క్రమశిక్షణతో కూడిన విద్యతో భవిష్యత్‌కు పునాది

మెనూ ప్రకారం శుచి, రుచిగా భోజనం అందించాలి 8 డీఈవో పురుషోత్తం

బల్లికురవ. జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : ప్రతి విద్యార్థిని క్రమ శిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తే భవిష్యత్‌కు పునాది వేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.పురుషోత్తం అన్నారు. గత నెల 27వ తేదీన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ‘విద్యార్థులకు వంట కష్టాలు’ శీర్షికన ఆంరఽధజ్యోతిలో వచ్చిన వార్తపై డీఈవో స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారం కేజీబీవీ విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ వంట చేసే పోస్టులు రెండు ఖాళీగా ఉండడంతో విద్యార్థులకు ఉపాద్యాయులే కొన్ని రోజులు వంట చేసి పెట్టారని ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లగా, అయన ఆదేశాల మేరకు రెండు రోజుల కిందట కొత్త వారిని నియమించామని తెలిపారు. మెనూ ప్రకారం శుచి, రుచిగా భోజనం అందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అనంతరం ఆయన విద్యార్థినులతో మాట్లాడుతూ చదువుతో పాటు తల్లిదండ్రులు మీపై పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్ట పడి చదవాలన్నారు. బడి మానేసిన విద్యార్థినులకు ఏర్పాటు చేసిన విద్యాలయంలో అన్ని వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయనతోపాటు ఏఎ్‌సవో శ్రీనివాసరావు, ఎంఈవో కె.రమేష్‌, ప్రిన్సిపాల్‌ సరళకుమారి ఉన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:32 AM