Share News

పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , Publish Date - Jan 01 , 2025 | 03:25 AM

యువతను సన్మార్గంలో నడిపేందుకు అవసరమైన మేలికొలుపు కార్యక్రమాలను విరివిగా నిర్వహించా లని మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ అన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరణ

మార్కాపురం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): యువతను సన్మార్గంలో నడిపేందుకు అవసరమైన మేలికొలుపు కార్యక్రమాలను విరివిగా నిర్వహించా లని మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ అన్నారు. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఐవైఎం ఆధ్వర్యంలో మత్తుపదార్థాలు, అశ్లీలానికి వ్యతిరేకంగా జరుగుతున్న రాష్ట్రవ్యాప్త ఉద్యమ గోడపత్రిక ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు బానిసలై జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారన్నారు. పెరిగిన సాంకేతికత నేపథ్యంలో అశ్లీలత కూడా విశృంఖలమైందన్నారు. వాటిని అదుపు అదుపు చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐవైఎం సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఐవైఎం రాష్ట్ర కార్యదర్శి షేక్‌ ఇస్మాయిల్‌, మాజీ రాష్ట్ర నాయకులు ఆయుబ్‌ఖాన్‌, జిల్లా అధ్యక్షులు తలహా, పట్టణ అధ్యక్షులు రసూల్‌, కార్యదర్శి ముజఫర్‌ అలి, జేఐహెచ్‌ పట్టణ అధ్యక్షులు సికిందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 03:25 AM