Share News

ఎడ్ల పందేలు నిర్వహించడం అభినందనీయం

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:16 PM

సంప్రదాయబద్ధంగా ఎడ్ల పందేలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మె ల్యే ఎంఎం కొండయ్య అన్నారు. మండల పరిధిలోని ఈపురుపాలెం పంచాయతీ బోయినవారిపాలెంలో బుధవారం రాష్ట్ర స్థాయి పోలురాధా ఎడ్ల పందేలను నిర్వహించారు. ఎమ్మెల్యే కొండయ్య, ఆయన సతీమణి బాలకొండమ్మ పోటీలను ప్రా రంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ గ్రామీణ వ్యవసాయదారుల మనోభావాలకు అనుగుణంగా ఎడ్ల పందేలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలలో గెలుపు ఓటములను స్ఫూర్తితో తీసుకోవాలన్నారు.

ఎడ్ల పందేలు నిర్వహించడం అభినందనీయం
ఎమ్మెల్యే కొండయ్య దంపతులను సన్మానిస్తున్న ఎడ్ల పందేల నిర్వాహకులు

ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : సంప్రదాయబద్ధంగా ఎడ్ల పందేలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మె ల్యే ఎంఎం కొండయ్య అన్నారు. మండల పరిధిలోని ఈపురుపాలెం పంచాయతీ బోయినవారిపాలెంలో బుధవారం రాష్ట్ర స్థాయి పోలురాధా ఎడ్ల పందేలను నిర్వహించారు. ఎమ్మెల్యే కొండయ్య, ఆయన సతీమణి బాలకొండమ్మ పోటీలను ప్రా రంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ గ్రామీణ వ్యవసాయదారుల మనోభావాలకు అనుగుణంగా ఎడ్ల పందేలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలలో గెలుపు ఓటములను స్ఫూర్తితో తీసుకోవాలన్నారు. రైతులకు ఎడ్లతో ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యువనేత మద్దులూరి అమర్‌నాథ్‌, నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎడ్ల పెంపకందార్లు, వివిధ ప్రాం తాల నుంచి వచ్చినవారు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

టీడీపీ కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడులకను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొండయ్యను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు తదితరులు పోటీ పడ్డారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కొండయ్య కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, మెప్మా, వెలుగు తదితర విభాగాలకు చెందిన వారు ఎమ్మెల్యే కొండయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 01 , 2025 | 11:16 PM