Share News

ఐక్యంగా సమస్యలను పరిష్కరించుకుందాం

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:30 PM

ఆక్వా సాగుచేసే రైతులు అందరం ఐక్యంగా ఉందాం.. సమస్యలను పరిష్కరించుకుందాం.. ప్రభుత్వ చేయూతను అందిపుచ్చుకొని అందుకు అనుగుణంగా భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకుని అడుగులు వేద్దామని కుం దేరు, స్ట్రయిట్‌ కట్‌ రొయ్య రైతుల సం క్షేమ సంఘం ప్రతినిధులు ఉద్ఘాటించారు. స్థానిక కుందేరు స్ట్రయిట్‌ కట్‌ సమీపంలోని అసోసియేషన్‌ కార్యాలయంలో ఆదివారం రొయ్య రైతుల సంక్షేమ సంఘం ప్రతనిధులు, సభ్యుల సమావేశం జరిగిం ది.

ఐక్యంగా సమస్యలను పరిష్కరించుకుందాం

ప్రభుత్వ చేయూతను అందిపుచ్చుకుందాం

రొయ్య రైతుల సంక్షేమ సంఘ ప్రతినిధుల ఉద్ఘాటన

వచ్చే ఆదివారం మరలా సమావేశమవుదామని తీర్మానం

xవేటపాలెం(చీరాల), జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : ఆక్వా సాగుచేసే రైతులు అందరం ఐక్యంగా ఉందాం.. సమస్యలను పరిష్కరించుకుందాం.. ప్రభుత్వ చేయూతను అందిపుచ్చుకొని అందుకు అనుగుణంగా భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకుని అడుగులు వేద్దామని కుం దేరు, స్ట్రయిట్‌ కట్‌ రొయ్య రైతుల సం క్షేమ సంఘం ప్రతినిధులు ఉద్ఘాటించారు. స్థానిక కుందేరు స్ట్రయిట్‌ కట్‌ సమీపంలోని అసోసియేషన్‌ కార్యాలయంలో ఆదివారం రొయ్య రైతుల సంక్షేమ సంఘం ప్రతనిధులు, సభ్యుల సమావేశం జరిగిం ది. సంఘ అధ్యక్షుడు తేళ్ల రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘ గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, సంఘ కార్యదర్శి ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) తదితరులు మాట్లాడుతూ సంఘ పరిధిలో సుమారు 1700 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల సాగు జరుగుతోందన్నారు. ఆ క్రమంలో రొంపేరు పూడిక తీత పనులు, ప్రస్తుతం సాగులో ఉన్న విస్తీర్ణం, పూడిక తీత నేపథ్యంలో సాగులో ఏర్పడే అంతరాలు, అందుకు సాగుదారులు సహకరించాల్సిన బాధ్యతలు, ప్రభుత్వ పరంగా స మకూరాల్సిన వనరులు, చేయూత గతం, వర్తమానం, భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. దీర్ఘకాలంగా జరుగుతున్న సాగు, స్వీయ అనుభవాలు, ఎదురైన సవాళ్లు, సానుకూల, ప్రతికూల పరిస్థితులను విశ్లేషించారు. క్రీక్‌లలో పూడిక తీత, తరువాత పూడికలు ఏర్పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రభుత్వ పరంగా అందే రాయితీలు, ఎన్ని ఎకరాలలోపు రైతులుకు ఏఏ రాయితీలు ఉంటాయనే అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. చెరువుల యజమానులు, కౌలుదారుల మధ్య ఉండాల్సిన అవగాహనపై ప్రత్యేకంగా చర్చించారు. అర ఎకరం చెరువు ఉన్న రైతు అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుందామన్నారు. యజమాని బాగుంటేనే కౌలుదారు బాగుంటాడని, అందుకు పలు ఉదాహరణలను పేర్కొన్నారు. వచ్చే ఆదివారం తిరిగి సమావేశమై పూర్తి స్థాయిలో ఆక్వా చెరువుల యజమానులు హాజరయ్యే విధంగా కార్యాచరణ రూపకల్పనకు దిశానిర్దేశం చేశారు. నిర్ధిష్టమైన నిర్ణయాలు తీసుకుని వాటి అమలుకు అడుగులు వేద్దామని తీర్మానించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పల్లపోలు శ్రీనివాసరావు, భాస్కరరెడ్డి, చెరువుల యజమానులు, పలువురు కౌలుదారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 11:30 PM