Share News

మద్యం దుకాణాలా..బార్‌లా?

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:33 PM

చీరాల ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని పలు మద్యం దుకాణాల నిర్వాహకులు వైన్‌ షాపుల వద్ద అనధికారిక పర్మిట్‌ రూములను ఏర్పాటు చేశారు. ఆయా దుకాణా ల్లో మద్యం కొనుగోలు చేసిన వ్యక్తులు దుకాణ నిర్వాహకులు ఏర్పాటు చేసిన రూములలో మద్యం సేవిస్తున్నారు. ఇది అందరికీ కనిపిస్తున్న బహిరంగ రహ స్యం. అయితే ఎక్సైజ్‌ అధికారులకు మా త్రం కనిపించడం లేదు. మద్యం దుకాణాల నిర్వాహకులు అందించే మామూళ్ల మత్తులో ఆ అధికారులకు సిట్టింగ్‌ రూ ములు కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

మద్యం దుకాణాలా..బార్‌లా?
ఈపురుపాలెంలో మద్యం దుకాణం వెనుక ఏర్పాటు చేసిన రూమ్‌లో తాగుతున్న మందుబాబులు

నిబంధనలకు పాతర

పట్టించుకోని అధికారులు

చీరాల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : చీరాల ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని పలు మద్యం దుకాణాల నిర్వాహకులు వైన్‌ షాపుల వద్ద అనధికారిక పర్మిట్‌ రూములను ఏర్పాటు చేశారు. ఆయా దుకాణా ల్లో మద్యం కొనుగోలు చేసిన వ్యక్తులు దుకాణ నిర్వాహకులు ఏర్పాటు చేసిన రూములలో మద్యం సేవిస్తున్నారు. ఇది అందరికీ కనిపిస్తున్న బహిరంగ రహ స్యం. అయితే ఎక్సైజ్‌ అధికారులకు మా త్రం కనిపించడం లేదు. మద్యం దుకాణాల నిర్వాహకులు అందించే మామూళ్ల మత్తులో ఆ అధికారులకు సిట్టింగ్‌ రూ ములు కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. మద్యం దుకాణాలా.. లేక బార్‌లా అని ప్రశ్నిస్తున్నారు. చీరాల ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో 24 మద్యం దుకాణాలు ఉన్నాయి. సుమారు 18 మద్యం దుకాణాలకు సంబంధించి అనధికారికం గా ఆయా దుకాణాల వద్ద సిట్టింగ్‌ రూములు ఏర్పాటు చేశారు. దీంతో కొన్ని చోట్ల గలాటాలు కూడా జరుగుతున్నాయి. వీటిపై ఎక్సైజ్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే కొన్ని మద్యం దుకాణాల వద్ద అవసరమైతే అనధికారిక సిట్టింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేసుకోండి, మామూ ళ్లు మాకు ఇవ్వండని కొందరు అధికారులు ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే పంథాలో ఆ దందా సాగితే ప్రభుత్వానికి అపప్రద రాక తప్పదని చెప్పడంలో సందేహం లేదు.

Updated Date - Jan 05 , 2025 | 11:33 PM