నిషేధిత జాబితాలో ఉన్న భూములు రైతులకు చెందేలా చర్యలు
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:59 AM
నిషేఽధిత జాబితాలో అన్యాయంగా ఉ న్న భూములు రైతులకు చెందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బీ ఎన్.విజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కొలచనకోటలో జరిగిన గ్రా మసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్
మద్దిపాడు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): నిషేఽధిత జాబితాలో అన్యాయంగా ఉ న్న భూములు రైతులకు చెందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బీ ఎన్.విజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కొలచనకోటలో జరిగిన గ్రా మసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో రీసర్వే కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, నిషిద్ధ జాబితాలో ఉన్న వివాదాస్పద భూములపై ప్రభుత్వ న్యాయపరమైన సలహా లు తీసుకుని సంబంధిత రైతులకు అన్ని విధాల న్యాయం జరిగేలా చూడా లని చెప్పారు. వైసీపీ హయాంలో భూ యజమానులను ఇబ్బంది పెట్టి జగన్ బొమ్మలతో హద్దురాళ్లు వేశారని, వాటిని నిషిద్ధ జాబితాలో చేర్చారని ఆయన చెప్పారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన గ్రామంలో భూ ములు రీ సర్వే చేస్తారనాన్నరు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మండవ జయంత్‌బాబు ఎంపీటీసీ అద్దేపల్లి దుర్గాభవాని, క్లస్టర్ ఇన్‌చార్జి దే వబత్తిన ప్రసాద్, తహసీల్దార్ సృజనకుమార్, ఆర్‌ఐ రమణయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు రమణారావు, మోపర్తి లాల్‌బహదూర్ పాల్గొన్నారు.