నగరంలో అర్ధరాత్రి యువకుల హల్‌చల్
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:07 PM
ఒంగోలు నగరంలో శనివారం అర్ధరాత్రి యువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. పెళ్ళూరులో ఓ కళాశాల వార్షిక వేడుకలు జరుగుతుండగా ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకులు కొంతమంది అక్కడ హడావిడి చేయడంతో కళాశాలకు చెందిన కొందరు యువకులు వారిని అడ్డుకున్నారు.
రెండు గ్రూపుల మధ్య ఘర్షణ
ఇరువురికి గాయాలు
ఒంగోలు క్రైం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరంలో శనివారం అర్ధరాత్రి యువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. పెళ్ళూరులో ఓ కళాశాల వార్షిక వేడుకలు జరుగుతుండగా ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకులు కొంతమంది అక్కడ హడావిడి చేయడంతో కళాశాలకు చెందిన కొందరు యువకులు వారిని అడ్డుకున్నారు. పెళ్ళూరుకు చెందిన మరి కొంతమంది యువకులు అక్కడే ఉన్న పాఠశాల వద్ద ఉండగా, ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకులు వారితో గొడవపడి ఓ స్కూటీని ధ్వంసం చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన పెళ్లూరుకు చెందిన అయ్యప్పపై డేవిడ్ అలియాస్ బిల్లా దాడి చేసి గాయపరిచాడు. ఈ వ్యవహారం అంతా అర్ధరాత్రి 12.30 గంటలకు జరిగింది. అయప్ప ఆసుపత్రితో చేరాడు. అప్పటికీ వారి మధ్య చెలరేగిన ఘర్షణ ఆగలేదు. ఆదివారం తెల్లవారుజామున 4.30లకు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే కుపంటి భిక్షాలు, మరికొంత మంది ఉండగా అక్కడకు పెళ్లూరు యువకులు, కళాశాల పూర్వ విద్యార్థులు కలిసి దాడి చేశారు. దీంతో భిక్షాలుకు గాయాలయ్యాయి. దీంతో రాత్రుళ్లు ఇలాంటి ఉదంతాలు జరిగినా పోలీసులు పట్టించుకోకపోవడంతో విమర్శిలు వ్యక్తమవుతున్నాయి.