దర్శి అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Jan 05 , 2025 | 11:36 PM
దర్శి నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆదివారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు కలిసి విజ్ఞప్తి చేశా రు. నర్సరావుపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి అ క్కడకు వచ్చారు.
దర్శి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): దర్శి నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆదివారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు కలిసి విజ్ఞప్తి చేశా రు. నర్సరావుపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి అ క్కడకు వచ్చారు. ఈసందర్భంగా మంత్రిని కలిసి నియోజకవర్గ సమస్యల ను వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభించి నిలచిపో యిన జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ పరిశోధన కేంద్రం పునర్నిర్మాణం ప నులు వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యలో నిలిచిపోయిన కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి నిధులు విడుదల చే యాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణం, సబ్ రిజిస్టార్ కార్యా లయం, నగర పంచాయతీ కార్యాలయం నిర్మాణాలకు నిధుల విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై మంత్రి పయ్యావుల కేశవ్ సానుకూలం గా స్పందించినట్టు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.