Share News

బదిలీల్లో ఏడాది సర్వీస్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలి

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:50 PM

విద్యాశాఖలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీలలో హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులకు మిని మం సర్వీ్‌సను ఒక సంవత్సరం ప్రాతిపదికగా తీసుకోవాలని పలువురు ప్రధానోపాధ్యాయులు ఆదివారం విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అద్దంకిలో మంత్రి రవికుమార్‌ను కలిసిన హెచ్‌ఎంలు తమ సమస్యలను రవికుమార్‌కు వివరించారు.

బదిలీల్లో ఏడాది సర్వీస్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలి
మంత్రి రవికుమార్‌తో మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయులు

మంత్రి రవికుమార్‌కు వినతిపత్రం

అందజేసిన హైస్కూల్‌ హెచ్‌ఎంలు

అద్దంకి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : విద్యాశాఖలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీలలో హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులకు మిని మం సర్వీ్‌సను ఒక సంవత్సరం ప్రాతిపదికగా తీసుకోవాలని పలువురు ప్రధానోపాధ్యాయులు ఆదివారం విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అద్దంకిలో మంత్రి రవికుమార్‌ను కలిసిన హెచ్‌ఎంలు తమ సమస్యలను రవికుమార్‌కు వివరించారు. గత ప్రభుత్వం హెచ్‌ఎంల ప్రమోషన్‌లలో అస్తవ్యస్త విధానాలను అనుసరించడంతో 2023లో ప్రమోషన్‌లు తీసుకున్న హెచ్‌ఎంలు 8 నెలల సర్వీ్‌సను కోల్పోవాల్సి వచ్చిందని, ప్రభుత్వం ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలకు రూపొందిస్తున్న చట్టంలో కనీస అర్హత 2 సంవత్సరాలుగా నిబంధన విధించనున్నారని ఉ పాధ్యాయ సంఘాల నాయకుల ద్వారా తెలిసిందని వివరించారు. రెండు అకడమిక్‌ ఇయర్స్‌ లేదా ఒక సంవత్సరం సర్వీసు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అయినా 2023లో పదోన్నతి పొందిన హెచ్‌ఎంలు కూడా కౌన్సిలింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించే విధంగా విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకు పోవాలని కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని హెచ్‌ఎంలు మహబూబ్‌ఖాన్‌, ఎం.శ్రీనివాసరావు, రామిరెడ్డి రాఘవ, పి.కృష్ణ ప్రసాద్‌, షేక్‌ మీరావలి, ఇందిరా, రామారావు ఉన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:50 PM