Share News

మార్కెట్‌ కమిటీల పదవులు కొలిక్కి

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:13 PM

అద్దంకి నియోజకవర్గంలో రెండు మార్కెట్‌ కమిటీలు ఉన్నా యి. అద్దంకి మార్కెట్‌ కమిటీ పరిధిలో అద్దంకి, కొరిశపాడు, జె.పంగులూరు మండలాలు, సంతమాగులూరు మార్కెట్‌ కమిటీ పరిధిలో సంతమాగులూరు, బల్లికురవ మండలాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రారంభించి మార్కెట్‌ కమిటీ లకు రిజర్వేషన్‌లు ప్రకటించారు. అద్దంకి మార్కెట్‌ కమిటీ ఎస్సీ మహిళ, సంతమాగులూరు మార్కెట్‌ కమిటీ జనరల్‌కు కేటాయించారు.

మార్కెట్‌ కమిటీల పదవులు కొలిక్కి
అద్దంకి మార్కెట్‌ కమిటీ కార్యాలయం

కూటమి ప్రభుత్వం వచ్చాక

వాటికి రిజర్వేషన్‌లు ఖరారు

అద్దంకి ఎస్సీ మహిళకు,

సంతమాగులూరుకు జనరల్‌ కేటాయింపు

నిరాశలో పోటీదారులు

అద్దంకి, జనవరి 1 (ఆంద్రజ్యోతి) : అద్దంకి నియోజకవర్గంలో రెండు మార్కెట్‌ కమిటీలు ఉన్నా యి. అద్దంకి మార్కెట్‌ కమిటీ పరిధిలో అద్దంకి, కొరిశపాడు, జె.పంగులూరు మండలాలు, సంతమాగులూరు మార్కెట్‌ కమిటీ పరిధిలో సంతమాగులూరు, బల్లికురవ మండలాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రారంభించి మార్కెట్‌ కమిటీ లకు రిజర్వేషన్‌లు ప్రకటించారు. అద్దంకి మార్కెట్‌ కమిటీ ఎస్సీ మహిళ, సంతమాగులూరు మార్కెట్‌ కమిటీ జనరల్‌కు కేటాయించారు. ఈనేపథ్యంలో అద్దంకి మార్కెట్‌ కమిటీకి గతంలో పోటీ పడ్డ పలువురు నేతలు ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ఒకింత నిరాశకు గురయ్యారు. అద్దంకి ఏఎంసీ చైర్‌ పర్సన్‌గా కొరిశపాడు మండలంలోని ఎస్సీ సామాజికవర్గానికి ఇవ్వనున్నారు. సంతమాగులూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సంతమాగులూరు మండలంలోని కమ్మ సామాజికవర్గం నేత పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. ఇక వైస్‌ చైర్మన్‌ల విషయంలో అద్దంకి, సంతమాగులూరు మార్కెట్‌ కమిటీలలో ఒకటి కాపు సామాజికవర్గానికి, మరొకటి బీసీ నేతల పేర్లపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆశావాహులను పిలిపించి మాట్లాడి తుది జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఒక సభ్యుల పేర్లపై కూడా కసరత్తు ప్రారంభించారు. మండలాలు, సామాజిక వర్గాల వారీగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

సొసైటీలకు త్రీమెన్‌ కమిటీల పేర్లపై కూడా కసరత్తు

సొసైటీలకు కూడా త్రీమెన్‌ కమిటీలను నియమించనుండడంతో ఇప్పటికే కసరత్తు ప్రారంభించి జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఆయా సొసైటీల పరిధిలోని గ్రామాల నేతలతో చర్చించి త్రీమెన్‌ కమిటీ సభ్యులను జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో పలువురు కూటమి నేతలకు నామినేటెడ్‌ పదవులు దక్కనున్నాయి.

Updated Date - Jan 01 , 2025 | 11:13 PM