ప్రజాసమస్యలు సత్వరమే పరిష్కారం
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:34 AM
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు.
మంత్రి గొట్టిపాటి
సంతమాగులూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. సంతమాగులూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 147 మంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. సమస్యలపై అందిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి గొట్టిపాటి సూచించారు.