Share News

రెవెన్యూ సదస్సులతో సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Jan 01 , 2025 | 03:28 AM

గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు.

రెవెన్యూ సదస్సులతో సమస్యలకు పరిష్కారం

కంభం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం బోగోలు పంచాయతీలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతాంగ సమస్యలను పరిష్క రించే దిశగా ఎన్‌డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కార్యాల యాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. పాస్‌పుస్తకంలో పేరు మార్పులు, ఆన్‌లైన్‌ సమస్యలు, రహదారి సమస్యలు రెవెన్యూ సదస్సులో పరిష్కరించుకో వచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని పరిష్క రించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమం లో తహసీల్దార్‌ నాగార్జున రెడ్డి, ఎంపీడీవో నరసయ్య, సర్పంచ్‌ పోతిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

మార్కాపురం రూరల్‌ : రెవెన్యూ సదస్సులను ప్రజ లు సద్వినియోగం చేసుకో వాలని తహసీల్దార్‌ చిరం జీవి కోరారు. మండలంలోని చింతగుంట్ల గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సును తహసీల్దార్‌ చిరంజీవి అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సదస్సులో ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలను ఎక్స్‌కవేటర్‌ సాయంతో తొలగించి స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ మా ట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్వేయర్‌ సంజీవయ్య, వీఆర్‌వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 03:28 AM