Share News

ధర్మ జీవనమే ముక్తికి మార్గం

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:49 AM

మానవుడు ధర్మమార్గం లో జీవించటం ద్వారానే ముక్తిని సాధించగలడని, ధర్మపధమే సమాజాని కి శ్రీరామరక్ష అని శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షువు బోధిహీన పేర్కొన్నారు.

 ధర్మ జీవనమే ముక్తికి మార్గం

శ్రీలంక బౌద్ధభిక్షువు బోధిహీన

ఒంగోలు(కల్చరల్‌), జనవరి 11(ఆంధ్రజ్యోతి): మానవుడు ధర్మమార్గం లో జీవించటం ద్వారానే ముక్తిని సాధించగలడని, ధర్మపధమే సమాజాని కి శ్రీరామరక్ష అని శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షువు బోధిహీన పేర్కొన్నారు. దేశ పర్యటనలో భాగంగా శనివారం ఒంగోలు నగరానికి వచ్చిన ఆయన స్థానిక అన్నవరప్పాడులోని శివం ఫౌండేషన్‌కు విచ్చేశారు. ఈ సందర్భం గా ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్థానిక శ్రీకాశీనాయన దేవాలయంలో బో ధిహీన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వి లేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బౌద్ధధర్మం ఎంతో సనాత నమైనదని, దానిని ప్రపంచం నలుమూలల ప్రచారం చేయటం కోసం తా ను పర్యటన జరుపుతున్నట్లు తెలిపారు. మానవుడు ధర్మమార్గంలో జీవిం చటానికి అవసరమైన ఎన్నో సూత్రాలను బౌద్ధధర్మం బోధిస్తుందన్నారు. గొల్లపూడి శ్రీహరి మాట్లాడుతూ ఆధ్యాత్మిక పధంలో పయనిస్తున్న బౌద్ధభి క్షువు తమ ఆశ్రమానికి రావటం ఆనందంగా ఉందన్నారు. నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ శివం ఫౌండేషన్‌ ద్వారా నిత్యం వందలాదిమందికి అన్నదానం జరుగుతుందని చెప్పారు. అనంతరం నిరుపేద మహిళ పెదకత్తుల కోటేశ్వరమ్మకు వైద్య ఖర్చుల ని మిత్తం ఆర్థికసహాయాన్ని అందజేశారు. బౌద్ధభిక్షువు బోధిహీన్‌ చేతులమీ దుగా అనాధలకు అన్నదానం జరిగింది. కార్యక్రమంలో ఏఆర్‌ ఏఎస్పీ అశోక్‌బాబు, తన్నీరు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:49 AM