Road Accident : మార్కాపురంలో స్కూల్ బస్సు బీభత్సం
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:43 AM
ప్రకాశం జిల్లా: మార్కాపురంలోని మీనా మసీదు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. స్కూల్ బస్సును డ్రైవర్ వేగంగా రివర్సు చేస్తుండగా అదుపుతప్పింది. ఈ ఘటనలో బస్సు ఢీ కొని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బైకులపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లా: మార్కాపురం (Markapuram)లోని మీనా మసీదు (Mina Mosque) వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు (Private School Bus) బీభత్సం సృష్టించింది. (Road Accident) స్కూల్ బస్సును డ్రైవర్ వేగంగా రివర్సు చేస్తుండగా అదుపుతప్పింది. ఈ ఘటనలో బస్సు ఢీ కొని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బైకులపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదంతో భయపడిపోయిన డ్రైవర్ విద్యార్థులను బస్సులో వదిలిపెట్టి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు ఏలూరు జిల్లా, భీమడోలు మండలం, అంబర్‌పేట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనకనుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘట ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అలాగే పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం .మొగల్తూరు రోడ్‌లోని బల్లకట్టు వద్ద స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఐదుగురు పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం..
బాపట్ల జిల్లా, కొరిశపాడు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ ఎక్సెల్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. స్కూటర్ పై ప్రయాణిస్తున్న అన్నపురెడ్డి హరికృష్ణ (29) అనే యువకుడు మృతి చెందాడు. అలాగే తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, బందపురం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒడిషా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు బాధ్యతలు
ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. వారికి మళ్లీ ఈడీ పిలుపు
హైదరాబాద్‌కు వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..
వైజాగ్, విజయవాడకు డబుల్ డెక్కర్ మెట్రో..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News