Share News

గొర్రెలకు తక్షణమే టీకాలు వేయించాలి

ABN , Publish Date - Jan 11 , 2025 | 01:01 AM

గొర్రెలకు వచ్చే బొబ్బవ్యాధి నివారణకు తక్షణ మే టీకాలు వేయించాలని ఏపీ గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి తోట తిరుపతిరావు కోరారు.

గొర్రెలకు తక్షణమే టీకాలు వేయించాలి

గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి తిరుపతిరావు

ఒంగోలు(రూరల్‌), జనవరి10(ఆంధ్రజ్యోతి): గొర్రెలకు వచ్చే బొబ్బవ్యాధి నివారణకు తక్షణ మే టీకాలు వేయించాలని ఏపీ గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి తోట తిరుపతిరావు కోరారు. ఒంగోలు మండలం కరవది గ్రామంలో శుక్రవారం గొర్రెలకు వచ్చిన బొబ్బవ్యాధిని సంఘ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ జిల్లాలోని పలుచోట్ల గొర్రెలకు బొబ్బవ్యాధి బారి న పడి జీవాలు మృతి చెందే పరిస్థితి నెలకొంద న్నారు. ముఖ్యంగా ఒంగోలు, నాగులుప్పలపాడు, చీమకుర్తి తదితర మండలాలలోని ఈ వ్యాధి వే గంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. అయితే దీని నివారణ కోసం ప్రభుత్వం టీకాలను సర ఫరా చేయడం లేదన్నారు. దీంతో కాపరలుఉ తె లంగాణ రాష్ట్రం నుంచి, పశుమందుల షాపులు నుంచి టీకాలు వైల్‌ రూ.1200లకు కొనుగోలు చేసి టీకాలు వేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యజమానులు అంత డబ్బు ఖ ర్చు పెట్టలేక పోతున్నారని, పాలకులు, ఉన్నతా ధికారులు స్పందించి వ్యాక్సిన్‌ తెప్పించి బొబ్బవ్యా ధిని అరికట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కుమ్మరి నరసింహారావు, గంగయ్య తదితరులుపాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 01:01 AM