Share News

అటవీ సంపద అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:23 PM

అటవీ సంపద అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెంచాలని కనిగిరి డివిజన్‌ ఫారెస్ట్‌ రేంజర్‌ ఉమామహేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో డివిజన్‌ స్థాయి ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బందితో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంరక్షణే లక్ష్యంగా ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ప్రత్యేకంగా బీట్‌ సిబ్బంది, అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు.

అటవీ సంపద అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
అటవీ డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న రేంజర్‌ ఉమామహేశ్వరరెడ్డి

కనిగిరి డివిజన్‌ ఫారెస్ట్‌ రేంజర్‌ ఉమామహేశ్వరరెడ్డి

కనిగిరి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): అటవీ సంపద అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెంచాలని కనిగిరి డివిజన్‌ ఫారెస్ట్‌ రేంజర్‌ ఉమామహేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో డివిజన్‌ స్థాయి ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బందితో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంరక్షణే లక్ష్యంగా ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ప్రత్యేకంగా బీట్‌ సిబ్బంది, అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. సీఎస్‌పురం మండలంలోని అటవీ సంపదపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలన్నారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో అక్రమణలకు గురైన వాటిని స్వాధీనం చేసుకుని, సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కారాదని సూచించారు. అటవీ ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా నిఘా చేపట్టాలని ఆదేశించారు. ఫారెస్ట్‌ బీట్‌లలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నాగిరెడ్డిపల్లి, ముళ్ళపాడు బీట్‌లలో, అటవీ సరిహద్దులలోకి ప్రవేశించే, వెళ్ళే వాహనాలను తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో డివిజన్‌స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 11:23 PM