Share News

స్టేట్‌ హైవేలను నేషనల్‌ హైవేలుగా మార్చాలి

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:57 PM

బాపట్ల జిల్లా పరిధిలోని పర్చూరు నియోజకవర్గంలోని ప లు కీలక స్టేట్‌ హైవేలను నేషనల్‌ హైవేలుగా మార్చాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రా సిన లేఖకు కేంద్ర మంత్రి నితిన్‌ గట్కరీ స్పందించారు. ఎమ్మెల్యే ఏలూరి లేఖకు ఆయన సమాధానం తెలిపినట్లు శనివారం ప్రకటనలో ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.

స్టేట్‌ హైవేలను నేషనల్‌ హైవేలుగా మార్చాలి

కేంద్రానికి ఎమ్మెల్యే ఏలూరి లేఖ

స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ

పర్చూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : బాపట్ల జిల్లా పరిధిలోని పర్చూరు నియోజకవర్గంలోని ప లు కీలక స్టేట్‌ హైవేలను నేషనల్‌ హైవేలుగా మార్చాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రా సిన లేఖకు కేంద్ర మంత్రి నితిన్‌ గట్కరీ స్పందించారు. ఎమ్మెల్యే ఏలూరి లేఖకు ఆయన సమాధానం తెలిపినట్లు శనివారం ప్రకటనలో ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. తక్షణమే స్టేట్‌ హైవేలను నేషనల్‌ హైవేలుగా మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఇందులో ఒక ప్రత్యేక అధికారిని పంపిస్తామని లేఖలో పేర్కొన్నారన్నారు.

ఎమ్మెల్యే ఏలూరి ప్రతిపాదించిన హైవేల వివరాలు

గుంటూరు - నాగులప్పలపాడు వయా ప్రత్తిపాడు, పెదనందిపాడు, పర్చూరు, ఇంకొల్లు మీ దుగా నాగులుప్పలపాడు వరకు 83.120 కిలోమీటర్లు స్టేట్‌ హైవేని నేషనల్‌ హైవేగా మార్చాలని ఎమ్మెల్యే ఏలూరి కోరారు. అద్దంకి టు మోటుపల్లి వయా రేణింగివరం, అలవలపాడు, చందలూరు, కొణికి, ఇంకొల్లు మీదుగా మోటుపల్లి వరకు 40.90 కిలోమీటర్లు స్టేట్‌ హైవేని నేషనల్‌ హైవేగా మార్చాలని వివరించారు. అదేవిధంగా బాపట్ల టు మార్టూరు వయా నర్సాయపాలెం, కంకటపాలెం, చెరుకూరు, వీరన్నపాలెం, కొమర్నేనివారిపాలెం, ఉప్పుటూరు, పర్చూరు, యద్దనపూడి, మీదుగా డేగరమూడి ఎన్‌హెచ్‌-16 వరకు 53 కిలోమీటర్లు రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని ఎమ్మెల్యే ఏలూరి కేంద్ర మంత్రి నితిన్‌ గట్కరిని కోరారు.

Updated Date - Jan 11 , 2025 | 11:57 PM